అప్పుడు హీరో, హీరోయిన్లు… ఇప్పుడు అన్నా, చెళ్లెళ్లు అయ్యారా…!

నటీనటులు తమ కెరీర్‌లో ఎన్నో పాత్ర‌లో నటిస్తు ఉంటారు. అలాంటి నటిన‌టుల‌ జీవితంలో ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఒక్క సినిమాలో హీరో, హీరోయిన్‌లుగా న‌టించిన వారు కొన్నిసార్లు అన్నచెల్లెలుగా కూడా న‌టిస్తు ఉంటారు. ఇది మ‌న టాలీవుడ్‌లో కొత్త ఏం కాదు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ద‌గ్గ‌ర‌ నుంచి ఇదే జరుగుతూ వస్తుంది.

ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. సుశాంత్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నటించిన సినిమా కాళిదాసు, ఇది సుశాంత్‌కు తొలి సినిమా. ఈ చిత్రం 2008లో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అలాగే ఇద్ద‌రి కెమిస్ట్రీకి కూడా ప్రేక్ష‌కుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. ఇప్పుడు15 ఏళ్ల తర్వాత సుశాంత్, తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ చిత్రంలో బ్రదర్ అండ్ సిస్టర్‌ల‌గా నటించారు.

తాజాగా భోళాశంకర్ ప్రమోషన్లు ఇదే విష‌య‌న్నీ చిత్రబృందం తెలియజేచేసింది. భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ, ఈ ఇద్ద‌రు నటించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, మరియు అవి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయని అన్నారు. ఈ చిత్రం వ‌చ్చే నెల‌ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకి రానున్నది. ఇప్పుడు త‌మన్నా, సుశాంత్‌కు సంబంధించిన ఇదే విష‌యన్నీ సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ చేస్తున్న‌రు