ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఇద్ద‌రు భార్య‌లు… ఇన్నాళ్ల‌కు బ‌య‌ట‌ప‌డిన నిజం..!

తెలంగాణ రాజకీయాలలో చిన్న కుదుపు అధికార బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పదవిపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. తాజాగా 84 పేజీల తీర్పు విలువరించింది. ఈ క్రమంలోనే ఆయనపై ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కొత్తగూడెం ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.

2018 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకట్రావు పై నాలుగు వేల పట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అనంత‌రం ఆయ‌న బీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. అయితే తప్పుడు వివరాలతో వనమా నామినేషన్ వేశారని.. తన మీద ఉన్న క్రిమినల్ కేసులు ఆస్తులు వివరాలు దాచారని ఆరోపిస్తూ జలగం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ వ్యవహారంపై సుదీర్ఘమైన విచారణ చేపట్టిన కోర్టు వనమా ఎన్నిక‌ చెల్లదంటూ తాజాగా తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలోనే కొత్తగూడెంలో ఉన్న ఒక ఇంటి స్థలాన్ని కూడా ఆస్తి వివరాల్లో చూపించలేదని.. అది ఆయన భార్య పేరిట ఉన్నదని విక్రయాలు జరిగిన డాక్యుమెంట్లు పరంగా కూడా ఆమె భార్య అని తేలుతుందని జలగం దావాలో పేర్కొన్నారు.

విచిత్రం ఏంటంటే ఈ ఆరోపణల ద్వారా వనమా వెంకటేశ్వరరావుకు ఇద్దరు భార్యలు ఉన్నట్టు కూడా వివరాలు బయటకు వచ్చాయి. ఏది ఏమైనా ఎప్పటికే బిఆర్ఎస్ పార్టీలో వన‌మా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కొడుకు వనమా రాఘవ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక వచ్చే ఎన్నికలలో ఆయనకు టిక్కెట్ దక్కటం కూడా కష్టమే అంటున్నారు.