ఆ స్టార్ హీరో ప్లాప్ సినిమా టైటిలే గోపీచంద్ కొత్త సినిమా టైటిల్‌

టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా అన్నీ ప్లాపులే అవుతున్నాయి. గోపీచంద్‌కు స‌రైన క‌మ‌ర్షియ‌ల్ హిట్ ఎప్పుడు వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించుకుంటే ఏ మాత్రం గుర్తు లేదు. అస‌లు గోపీచంద్‌కు ఎప్పుడు హిట్ వ‌చ్చిందో ? ఎప్ప‌ట‌కి వ‌స్తుందో కూడా చెప్ప‌డం క‌ష్టంగా మారింది. రీసెంట్‌గా గోపీచంద్ శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బాణం సినిమా చేశాడు.

Amazon.com: Bheema : Ashish Vidyarthi, Prakash Raj, Raghuvaran, Trishna,  Vikram, Sujatha, N.Linguswamy, Bendev Junior, A.M. Rathnam: Prime Video

పైగా ఈ సినిమాకు శ్రీవాస్ ద‌ర్శ‌కుడు. జ‌గ‌ప‌తిబాబు, ఖుష్బూ లాంటి భారీ తారాగ‌ణం న‌టించినా కూడా సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అయితే ఇప్పుడు కాస్త గ్యాప్ తీసుకుని త‌న కొత్త సినిమాను ప‌ట్టాలెక్కించేశాడు. కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వం లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు. గోపీచంద్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా మేక‌ర్స్ టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కూడా వ‌దిలేశారు.

ఈ సినిమాకు భీమా అనే టైటిల్ పెట్టారు. గోపీచంద్‌ను ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపించారు. పోలీస్ ఆఫీస‌ర్‌గా గోపీచంద్‌కు ఇది రెండో సినిమా. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌ పై కెకె రాధామోహన్ ఈ మాస్ యాక్ష‌న్ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవ‌రు ? ఇత‌ర తారాగాణం ఎవ‌రు ? అన్న‌ది నాలుగు రోజుల్లో వెల్ల‌డించ‌నున్నారు.

ఇదిలా ఉంటే గ‌తంలో ఇదే భీమా అనే టైటిల్‌తో తెలుగులో ఓ డ‌బ్బింగ్ సినిమా కూడా వ‌చ్చింది. విక్ర‌మ్‌, త్రిష జంట‌గా న‌టించారు. ఈ సినిమాలో సాంగ్స్ బాగున్నా ప్రేక్ష‌కుల‌కు బాగా ఎక్క‌లేదు. మ‌రి ఇప్పుడు ఈ ప్లాప్ టైటిల్‌తో వ‌స్తోన్న గోపీచంద్ ఈ సారి అయినా హిట్ కొడ‌తాడా ? లేదా ? అన్న‌ది చూడాలి.