మహానటి సావిత్రి అనేక పాత్రలు పోషించారు. ఇటు పౌరాణికం.. అటు సాంఘికం.. ఇలా అనేక పాత్రల్లో ఆమె జీవించారు. దాసీగా, దేవదాసీగా, వేశ్యగా కూడా ఆమె నటించారు. అయితే.. ఏ పాత్రలో నటించినా.. ఆమె దానికి న్యాయం చేశారనే చెప్పాలి. అయితే.. ఎన్ని పాత్రలు చేసినా.. ఆమె కు కూడా ఒక కొరత మిగిలిపోయింది. అదే.. సీతాదేవి పాత్ర. ఆమె తన జీవితంలో అనేక పాత్రలు వేసినా.. సీతాదేవిగా మాత్రం నటించలేదు.
లక్ష్మిగా, సరస్వతిగా, పార్వతీదేవిగా.. భూదేవిగా.. ఇలా అనేక చిత్రాల్లో నటించారు సావిత్రి. అయితే.. ఆమె కు సీతాదేవి పాత్రలు వచ్చినా..చేయలేనని చెప్పారు. వాస్తవానికి లవకుశ సినిమాలో ముందు సావిత్రినే అనుకున్నారు. ఈ కథలో అన్నగారి సరసన ఆమె అయితే.. బాగుంటుందనే అంచనాలు కూడా వచ్చా యి. కానీ, ఆమె ఒప్పుకోలేదు. ఇక, తర్వాత.. వచ్చిన అనేక సినిమాల్లోనూ.. సావిత్రికి సీత పాత్ర వచ్చినా.. ఆమె వద్దన్నారు.
తమిళంలో వచ్చిన రామాయణే సినిమాలో భూమాతగా నటించారు తప్ప.. సీతాదేవిగా ఆమె చేయలేదు. దీనికికారణం చెబుతూ.. సీతాదేవి పాత్రలో అనేక కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు నేను భరించలేను. అందుకే ఆ పాత్ర నేను చేయను. అన్నారు. అయితే.. అనూహ్యంగా ఆమె జీవితం.. సీతకన్నా ఎక్కువ కష్టాలు చవి చూడాల్సి వచ్చింది. జీవితంలో ఎన్నో మెట్లు ఎదిగిన.. సావిత్రి.. తర్వాత.. అంతే పతనానికి చేరుకున్న విషయం తెలిసిందే.