మెగా ఫ్యామిలీకి అల్లుడుగా మారబోతున్న ఒకప్పటి స్టార్ హీరో.. ఇంతకీ ఎవరంటే..!

మెగా కుటుంబంకి సంబంధించిన ఓఇంట్రెస్టింగ్ వార్త ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. అసలు మేటర్ లోకి వెళితే త్వరలోనే మెగా కుటుంబంలోకి ఒకప్పటి స్టార్ హీరో అల్లుడుగా వెళ్ల‌బోతున్నాడట. ఇక ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు గతంలో ప్రేమ కథ సినిమాల్లో నటిస్తూ లవర్ బాయ్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్నన తరుణ్. వివరాల్లోకి వెళితే మెగా డాటర్ నిహారిక రీసెంట్ గానే విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

2020లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి జరిగింది. దాదాపు రెండుళ్ల పాటు ఇద్దరు కలిసి బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరికి వారు విడిపోయారు. ఇదే సమయంలో మరొ ప‌క్క‌ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా గత కొంతకాలంగా తన భర్త కళ్యాణ్ దేవ్ కి దూరంగా ఉంటుంది. వీరిద్దరూ విడిపోయినట్టు అధికారికంగా ప్రకటించకపోయిన త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారు అంటూ టాలీవుడ్ మీడియాలో గత కొంతకాలంగా వినిపిస్తుంది. అయితే వీరిద్దరిలో ఒకరితో తరుణ్ పెళ్లి జరగబోతుందనే రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇదే సమయంలో తరుణ్ పెళ్లి గురించి అతని తల్లి సీనియర్ నటి రోజా రమణి కూడా రీసెంట్‌గా స్పందించారు. త్వరలోనే తరుణ్ పెళ్లి జరగబోతుందని అమ్మాయి కూడా టాలీడ్‌కు చెందిన ఓ బడా ఫ్యామిలీ నుంచి వస్తుందని కూడా చెప్పారు. ఆమె మాటలు విన్న చాలామంది నెటిజన్లు ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీస్ అంటే దగ్గుబాటి, అక్కినేని, మెగా, నందమూరి ఫ్యామిలీలు. ఇక వీరిలో అక్కినేని ఫ్యామిలీలో అమ్మాయిలు లేరు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా వెంకటేష్ కూతురికి పెళ్లి అయింది మరో కూతురు ఉంది.

ఇక ఆ కూతురుకి తరుణ్ కి ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉంటుంది. అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూతుర్లకు పెళ్లి అయింది. ఇక మిగిలింది మెగా ఫ్యామిలీనేనని.. మెగా ఫ్యామిలీలో విడాకులు తీసుకున్న శ్రీజనో లేకపోతే నిహారికనో తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కొంతమంది నెటిజన్లు కావాలనే ఈ వార్తలు వైరల్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియ‌దు కానీ తరుణ్ అభిమానులు మాత్రం రెండో పెళ్లి వారిని పెళ్లి చేసుకోవాల్సిన కర్మ తరుణ్ కి ఏంటి అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి.