స్టార్ హీరోయిన్ తమన్నా టాలీవుడ్ లో అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్నా అదే క్రేజ్ తో టాలీవుడ్ లో కొనసాగుతూంది. ప్రస్తుతం సీనియర్ హీరో చిరంజీవికి జంటగా భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న తమన్నా, తమిళ్లో రజనీకాంత్‌కు జంటగా జైలర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల్లు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకరోజు తేడాతో పోటీకి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్టు 10న జైలర్, ఆగస్టు 11న భోళా శంకర్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోనూ జీ కర్ధా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకొని మంచి ఫామ్ లో దూసుకుపోతుంది తమన్నా. ఇలాంటి నేపథ్యంలో తమన్న రెమ్యూనరేషన్.. ఆస్తుల విలువలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. తమన్నా ప్రస్తుతం సినిమాకు రూ.4 నుంచి 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట.
ఈ మిల్కీ బ్యూటీ సినిమాలతో పాటు కొన్ని యాడ్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ మరిన్ని కోట్ల రెమ్యూనరేషన్ తన ఖాతాలో వేసుకుంటుంది.అంతేకాక ఫారెన్ కంట్రీస్ లో ఫుడ్ బిజినెస్ చేస్తున్న తమన్నా వైట్ అండ్ గోల్డ్ పేరుతో జువెలరీ బిజినెస్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అది సూపర్ సక్సెస్ గా రన్ అవుతుంది.
ఇవే కాకుండా వారసత్వంగా కూడా తమన్నాకు కొంత ఆస్తి వచ్చిందని అలా అటు ఇటు తిరగేసి చూసుకున్న ఎంత కాదన్నా ఆమె ఆస్తి రూ.220 కోట్లకుపైగా విలువ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇవే కాకుండా ఆమె వద్ద ఎంతో విలువైన రెండు వజ్రాల మూటలు ఉన్నాయట. వాటితో పాటు లగ్జరీ కార్లు, ఫ్లాట్స్, విల్లాస్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. దీంతో ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్లు అందరి కంటే తమన్నానే రిచ్ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.