మిల్కీ బ్యూటీ తమన్నా పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ ముదురు ముద్దుగుమ్మ ఇప్పుడు అటు వెండితెర మీద.. ఇటు బుల్లితెర మీద ఇటు ప్రియుడుతో సాగిస్తున్న ప్రేమాయణం ఇలా రకరకాల వార్తలతో మీడియాలోను.. సోషల్ మీడియాలోనూ నానుతుంది. ఈ ముదురు ముద్దుగుమ్మ ఈ వయసులోనూ ఎక్కడ తనలో హాట్నెస్ ఏమాత్రం తగ్గలేదన్నట్టుగా బిహేవ్ చేస్తోంది.
తాజాగా ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్లలో పిచ్చపిచ్చగా అందాలు ఆరబోస్తోంది. మరోవైపు తన ప్రియుడుతో వెబ్ సిరీస్లలో నటిస్తూ మూతి ముద్దులు ఇస్తోంది. తాజాగా ఆమె తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా బోళాశంకర్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్లో ఈ భామ కర్జ్, లస్ట్ స్టోరీస్ లాంటి హాట్ వెబ్ సిరీస్ లలో కనిపించింది. మునుపెన్నడూ లేనంత అందాల ఆరబోతతో గేట్లు ఎత్తే సీన్లు చేస్తూ దేవుడా అసలు ఈమె తమన్నా నేనా ? అన్న సందేహం వచ్చేలా రెచ్చిపోయింది.
ఈ రెండు సిరీస్లో దెబ్బతో తమన్నాపై తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ నడుస్తోంది. దీనిపై తమన్నా స్పందించింది. తను చాలాసార్లు గమనించానని డబుల్ స్టాండర్డ్స్.. అందరి హీరోలు ప్రతి సినిమాలో వైలెన్స్ చేస్తారు.. అలాంటి సీన్లు చేసి వాళ్ళు స్టార్ హీరోలు అయిపోతున్నారు.. అదే హీరోయిన్ అలాంటి సీన్లలో నటిస్తే మాత్రం వాళ్ళ క్యారెక్టర్ జడ్జి చేస్తున్నారు.. వాళ్లపై దారుణమైన కామెంట్లు చేస్తున్నారంటూ వాపోయింది.
ఈ ట్విట్టర్ అంకుల్స్ వాళ్లకు ఉన్న అభిప్రాయాలను ఓపెన్ గా చెబుతున్నారు. 2023 లో కూడా అమ్మాయిలు ఎలా ? ఉండాలో వాళ్లే డిసైడ్ చేస్తున్నారు.. వారు చెప్పిన మాటలు మీడియా వాళ్ళు తంబ్నైల్స్గా తీసుకుని ఆర్టికల్స్ రాసి బయటపెడుతున్నారు అంటూ తమన్నా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటిమేటెడ్ సీన్లలో హీరోలు నటిస్తే స్టార్ హీరోలు అవుతున్నారు.. అదే హీరోయిన్లు ఆ సీన్లలో చేస్తే క్యారెక్టర్ ని తప్పుపడుతున్నారు.. ఈ వివక్ష ఎందుకు ? అంటూ తమన్నా ప్రశ్నించింది. ప్రస్తుతం తమన్నా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక తమన్నా బాలీవుడ్ కి చెందిన విజయవర్మతో పీకల్లోతు ప్రేమాయణంలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నారు.