టాలీవుడ్ లో ఓ సినిమా హిట్ అయింది అంటే అది కేవలం కొద్దిరోజులు మాత్రమే ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అదే ఓ పాట హిట్ అయితే చాలాకాలం అలా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది. అలా పుష్ప సినిమాకు చంద్రబోస్ లిరిక్స్ రాసి.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసిన పాట ఊ అంటావా మావ.. ఊ..ఊ అంటావా..! ఈ పాట సినిమాలో ఎంత హైలెట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సమంత ఈ పాటలో తన అంద చందాలతో పాటు హుషారెత్తించే డ్యాన్సుతో అదరగొట్టింది.
సమంత కెరీర్లోనే ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఈ పాట రికార్డులు సృష్టించింది. ఈ సినిమా రిలీజై దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న సరే ఇప్పటికీ ఈ పాట ట్రెండ్ అవుతుందంటే ఈ పాట ఏ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుందో అర్థమవుతుంది. కానీ ఈ పాటకు ముందుగా సుకుమార్ అనుకున్నది సమంతను కాదట. మిల్కీ బ్యూటీ తమన్నాని ఈ సాంగ్ కోసం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. సుకుమార్ తన సినిమాల్లో ఐటెం గర్ల్స్ గా హీరోయిన్లను చూపించే సాహసం చేస్తూనే ఉంటాడు.
ఈ నేపథ్యంలో తమన్నాని అప్రోచ్ అయ్యాడట. తమన్నా – అల్లు అర్జున్ సరసన బద్రీనాథ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్లాప్ అయ్యింది. పుష్ప టైంకు తమన్నా కెరీర్ మంచి ఫామ్ లో ఉండడంతో అల్లు అర్జున్ సరసన అలాంటి సాంగ్ లో నటించడానికి ఇష్టపడలేదట. దాంతో అల్లు అర్జున్ సమంతను సజెస్ట్ చేశాడు. సుకుమార్ ఆమె ఒప్పుకుంటుందో లేదో అని సందేహంతో ఉండగా అల్లు అర్జున్ సమంతకు ఫోన్ చేసి ఈ పాట చేయడానికి ఒప్పించాడట. దీంతో ఈ పాటలో సమంత నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.