మిల్కీ బ్యూటీ తమన్నా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో బాగా నానుతోంది. బాలీవుడ్ యాక్టర్ విజయవర్మతో ప్రేమలో పడి అతడితో కలిసి దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వార్తల్లో తమన్నా పేరు మార్మోగుతోంది. తాజాగా ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ 2 అనే బోల్డ్ వెబ్ సిరీస్ ద్వారా నేషనల్ మీడియాలో తమన్నా పేరు ట్రెండింగ్‌లో ఉంది. మరింతగా వైరల్ అయింది.
గతంలో తమన్నాకు ఒక స్టార్ క్రికెటర్‌తో వివాహం జరిగిందన్న గుసగుసలు నడిచాయి. తమన్నా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ తో ప్రేమాయణం నడిపిందని.. ఇద్దరు దుబాయ్ లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ వార్తలు గతంలో వైరల్ అయ్యాయి. 2017లో తమన్నా – రజాక్ ను దుబాయ్ దుబాయ్ లో ఒక జ్యూలరీ షాప్ ఓపెనింగ్ లో కలిసింది.
ఆ తర్వాత అతడితో ప్రేమలో పడిందని వార్తలు వైరల్ అయినా తమన్నా దానిని ఖండించింది. అవన్నీ పుకార్లని రజాక్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారని… అతడు తను జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నాడని… నాకు క్రికెటర్ రజాక్ కి ఎటువంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక విజయవర్మతో ప్రేమలో ఉన్న విషయం బయటకు రావడంతో తమన్నా గతంలో క్రికెటర్ తో కూడా ప్రేమాయణం నడిపిందంటూ మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో సెన్షేషన్ అయ్యింది.
ప్రస్తుతం తమన్నా – విజయ వర్మతో కలిసి ప్రేమలో ఉన్న విషయాన్ని స్వయంగా తానే బయట పెట్టింది. అలాగే లస్ట్ స్టోరీ 2 లో హద్దులు దాటి మరి బో… సీన్స్ లో నటించింది. ప్రేమలో ఉన్నప్పుడు వారి స్థాయి ఏంటి? మన స్థాయి ఏంటి? వారు చేసే పని ఏంటి? మనం చేసే పని ఏంటి? అని ఆలోచనలు ఉండవని విజయవర్మ నా ఆనందాల గని అని తమన్నా చెప్పింది.