టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 17 సంవత్సరాలు దాటినా ఇంకా అదే క్రేజ్‌తో ఇండస్ట్రీలో కొనసాగుతుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల ద్వారా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇలీవల టాలీవుడ్లో చిరంజీవితో ‘ భోళా శంకర్ ‘ రజనీకాంత్‌తో ‘ జైలర్ ‘ సినిమాలో నటించిన తమన్నా భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో పాల్గొంది. ఇందులో భాగంగా హైపర్ ఆది తమన్నాను ఇంటర్వ్యూ చేశాడు. టాలీవుడ్ హీరోలు అందరితో కలిసి వర్క్ చేశారు. వారి గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు..? అని తమన్నాను ప్రశ్నించాడు ఆది. ముందుగా చిరంజీవి గురించి చెబుతా ఆయన యూనిక్ స్టార్, ఆయనని ఇష్టపడనివారు ఉండరు.
ఇక పవర్ స్టార్ – వెరీ మాస్ అండ్ స్టైలిష్ పర్సన్, ప్రభాస్ ప్రతి ఒక్కరికి డార్లింగ్, మహేష్ బాబు గుడ్ లుకింగ్, గ్లామర్ హీరో, జూనియర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ డాన్స్, ఫైట్స్ అదరగొడతారు. అలాగే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్, సూపర్ డాన్సర్ తెలుగులోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో, రామ్ చరణ్ లాయల్ పర్సన్ అంటూ స్టార్ హీరోలు అందరి గురించి సింపుల్‌గా ఒక్క మాటలో వివరించింది. ప్రస్తుతం తమ అభిమాన హీరో గురించి తమన్నా చెప్పిన విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.