టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా మంచి ఊపు మీద ఉందనే చెప్పాలి. ఇప్పుడు సీనియర్ హీరోలకు తమన్నా మంచి ఆప్షన్ గా మారిపోయింది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కు జోడిగా ఎఫ్2 – ఎఫ్3 సినిమాలలో నటించింది. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలోను జోడి కట్టింది. చివరగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న బాలయ్య – బాబి సినిమాలోని తమన్నాయే హీరోయిన్ అని ప్రచారం జరుగుతుంది.
మరోవైపు బాలీవుడ్ లో లస్ట్ స్టోరీస్ 2 జీ కర్ద్ వెబ్ సిరీస్‌లలో ఎంత హాట్‌గా నటించిందో చూసాం. ఇప్పటి వరకు అలాంటి విషయాలలో మడి కట్టుకుని కూర్చున్న తమన్నా ఓటీటీలో సీరిస్ లు అనేసరికి ఎందుకో బాగా ఓపెన్ అయిపోయింది. మూతిము..ద్దులు, శృంగా..*ర సీన్లలో రెచ్చిపోయింది. కొన్నాళ్ల ముందు సోషల్ మీడియా మొత్తం ఇదే పెద్ద హాట్ టాపిక్ అయింది.
తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన తమన్నా దశాబ్దంన్నర కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించింది. ఇన్నేళ్ల కెరీర్‌లో తమన్నా ఎందరో స్టార్ హీరోలకు జోడిగా నటించింది. విచిత్రం ఏంటంటే ఒక రోజు తేడాలో చిరంజీవికి జోడిగా నటించిన భోళాశంకర్ – రజనీకాంత్ జోడిగా నటిస్తున్న జైలర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తాజాగా తమన్నా చేతికి డైమండ్ రింగ్ ఉన్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.
దీనిని మెగా కోడలు ఉపాసన ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. దీనిని తమన్నా ఖండించింది. అది అసలు డైమండ్ రింగ్ కాదని.. అది సోడా బాటిల్ ఓపెనర్ అని క్లారిటీ ఇచ్చింది. దీంతో నెటిజన్లు ఓర్నీ ఇదా సంగతి అని తలలు పట్టుకుంటున్నారు.