మెగాస్టార్ చిరంజీవికి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. వృత్తి పరంగా ఈ వయస్సులోనూ వరుసగా సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్‌ను ఉత్తేజ పరుస్తున్నాడు. వ్యక్తిగతంగా చిరుకు ఎప్పుడూ ఏదో ఒక బాధ, కష్టం తప్పడం లేదు. ముఖ్యంగా ఇద్దరు కుమార్తెల వ్యక్తిగత జీవితాలు అంత సఖ్యతగా లేకపోవడం చిరును ఎప్పుడూ బాధపెడుతూనే ఉంది.
పెద్ద కుమార్తెకు చెన్నైకు చెందిన అబ్బాయితో పెళ్లి చేశారు. పెళ్లయిన కొద్ది సంవత్సరాల పాటు కాపురం చేశాక సుస్మితకు భర్తతో విబేధాలు వచ్చాయంటారు. ఆమె ఇప్పుడు హైదరాబాద్‌కు వచ్చేసింది. తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఇక్కడ సినిమా నిర్మాణంలోకి ఎంటర్ అయ్యింది. ఇక రెండో కుమార్తె సుస్మితది మరో కష్టం. ఆమెకు ముందుగా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
ఓ పాప పుట్టాక భర్తకు విడాకులు… తర్వాత కళ్యాణ్‌దేవ్‌తో రెండో వివాహం.. ఇప్పుడు కూడా ఓ పాప పుట్టాక భర్తకు దూరంగా ఉంటోంది. రేపో మాపో విడాకులు అంటున్నారు. చిరుకు రెండో కూతురు శ్రీజ లైఫ్‌లో ఇబ్బందులు చాలా తలనొప్పిగా మారాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాత అవతారం ఎత్తుతోంది.
కొత్త దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే చిరు మాత్రం అంత పెద్ద రిస్క్ వద్దని చెపుతున్నారట. మరో బయట బ్యానర్ వచ్చి సినిమా పెట్టుబడి అంతా మేం పెడతాం… మా బ్యానర్‌తో పాటు సుస్మిత బ్యానర్ పేరు వేసి.. లాభాల్లో సగం వాటా ఇస్తామని చెప్పిందట. ఈ ఆఫర్ చిరుకు నచ్చినా.. సుస్మిత మాత్రం తాను ఓన్‌గానే తండ్రితో సినిమా తీస్తానని పట్టుబడుతోందట.
చిరు మాత్రం రేపటి రోజు ఏ మాత్రం తేడా కొట్టినా సుస్మితకు ఇబ్బంది అవుతుందని.. ఆమెకు సినిమా నిర్మాణంలో సరైన అవగాహన లేదని చెపుతున్నా ఆమె మాత్రం వినడం లేదట. దీంతో చిరు కూతురు కోరికకు ఎస్ నో చెప్పలేక సతమతమవుతున్నాడట.