మహేష్ – నమ్రత మధ్య ఈ తేడా గమనించారా… ఈ సీక్రెట్ తెలిస్తే ఫ్యీజులు ఎగురుతాయ్‌..!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు – న‌మ్ర‌తా శిరోద్క‌ర్ ప్రేమ‌, పెళ్లి పెద్ద సంచ‌ల‌నం. వీరి పెళ్లి జ‌రిగే టైంకు అస‌లు వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్న‌ట్టే చాలా మందికి తెలియ‌దు. అస‌లు వీరి నేప‌థ్యాలు వేరు.. వీరి భాష‌లు వేరు. వీరి ప్రాంతాలు వేరు. అయినా మ‌న‌స్సులు క‌ల‌వ‌డంతో వీరు ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం 2000లో వ‌చ్చిన వంశీ సినిమాలో మాత్ర‌మే వీరు జంట‌గా న‌టించారు. ఆ సినిమా కూడా స‌రిగా ఆడ‌లేదు.

అయితే ఆ సినిమా షూటింగ్ కోసం ద‌ర్శ‌కుడు బి. గోపాల్ ఆస్ట్రేలియాలో 40 రోజుల పాటు సుధీర్ఘ‌మైన షెడ్యూల్ ప్లాన్ చేశారు. అప్పుడే మ‌హేష్‌, నమ్ర‌త మ‌ధ్య ప్రేమ చిగురించి నాలుగేళ్ల‌కు పైగా ప్రేమించుకుని 2005లో పెళ్లి చేసుకున్నారు. మామూలుగా వీరి ప్రేమ చిగురించే టైంకు న‌మ్ర‌త బాలీవుడ్‌లో పాపుల‌ర్ హీరోయిన్. అప్ప‌టికే ఆమెకు పెద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు ప‌డ్డాయి. సంజ‌య్‌ద‌త్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్ లాంటి వాళ్ల‌తో క‌లిసి ప‌నిచేసింది. ఆమె మాజీ మిస్ ఇండియా. ఆమె సోద‌రి శిల్పా శిరోద్క‌ర్ కూడా న‌టి.

ఆమె తెలుగులో మోహ‌న్‌బాబు హీరోగా వ‌చ్చిన బ్ర‌హ్మ సినిమాలో నటించింది. అయితే న‌మ్ర‌త – మ‌హేష్ మ‌ధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. వ‌య‌స్సులో మ‌హేష్ కంటే న‌మ్ర‌తే పెద్ద‌. ఇక వీకీపీడియా ప్ర‌కారం వీరిద్ద‌రి పుట్టిన రోజు తేదీలు చూస్తే న‌మ్రతా శిరోద్కర్ జ‌న‌వ‌రి 22, 1972లో ముంబైలో జ‌న్మించింది. ఆమె వ‌య‌స్సు 50 ఏళ్లు. మహేశ్ ‌బాబు ఆగ‌స్టు 1975లో మ‌ద్రాస్‌లో జ‌న్మించారు.

మ‌హేష్ వ‌య‌స్సు 47. ఇంత ఏజ్ గ్యాప్ అంత‌రం ఉన్నా కూడా వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇలా ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకున్న ఎన్నో జంట‌లు కొన్ని నెల‌లు లేదా ఏళ్లు కాపురం చేసి విడాకులు తీసుకున్నారు. కానీ మహేష్, న‌మ్ర‌త‌ మాత్రం ఎంతో హ్యాపీగా తమ లైఫ్ లీడ్ చేస్తున్నారు. టాలీవుడ్ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒక్కరుగా పేరు తెచ్చుకున్నారు.