టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్‌బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 47 ఏళ్ల వయసులో కూడా కుర్రాడిలా కనిపిస్తూ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు మహేష్ బాబు. మహేష్ బాబుకి అమ్మాయిల్లో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇప్పటికే అంత అందంగా, ఫీట్ గా ఉండడానికి కారణం ఏంటి ఎలా ? అంత అందంగా ఉంటున్నాడన్న సందేహాలు ఫ్యాన్స్‌తో పాటు చాలామంది సినీ ప్రముఖులకు కూడా ఉంటూ ఉంటాయి.
అంత అందంగా ఉండడానికి మహేష్ ఏం తింటాడు అని మహేష్ బాబుని కూడా చాలా ఇంటర్వ్యూలో అడిగారు. ఎప్పుడు సరిగ్గా సమాధానం చెప్పకుండా నవ్వుతూ తప్పించుకుంటాడు. మహేష్ అంత అందంగా, ఫిట్‌గా ఉండడానికి ఫుడ్ మెయిన్ రీజన్. గతంలో కూడా చాలా సందర్భాల్లో మహేష్ ఇది చెప్పుకుంటూ వచ్చాడు. నేను ఏది పడితే అది తినను.. చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటాను.. ఫుడ్‌లో చాలా జాగ్రత్తలు పాటిస్తానని చెప్పాడు..
తనకి సపరేట్ కుక్ ఉంటాడని.. న్యూట్రిషన్ టిప్స్ తోనే ఫుడ్ తీసుకుంటానని చెప్పిన మహేష్ బాబు షూటింగ్స్ లో కూడా షూటింగ్ కుక్ వండింది తినకుండా.. తన పర్సనల్ కుక్ వండిందే తింటానని.. డైరీ ప్రొడక్ట్స్, స్వీట్స్ కూడా తిననని చెప్పుకొచ్చాడు. ఇటీవల మహేష్ సోషల్ మీడియా వేదికగా తాను తినే బ్రేక్ ఫాస్ట్ గురించి వివరించాడు. తాను బ్రేక్‌ఫాస్ట్ తింటున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.
ఇదే నా డైలీ రొటీన్.. రాత్రంతా నానబెట్టిన ఓట్స్, కొన్ని మొలకెత్తిన గింజలు, డ్రై ఫ్రూట్స్ – నట్స్ కలిపి తింటాను. ఇది కొన్ని గంటల వరకు నాకు ఎనర్జీని ఇస్తుంది. ఇదే నా బ్రేక్ ఫాస్ట్ అని టైప్ చేశాడు. అలాగే నా న్యూట్రిషన్.. నా లుక్ కాల్ ట్యాగ్ చేసి ఫుడ్ సజెస్ట్ చేసే ఓ మంచి న్యూట్రిషన్ అంటూ వివరించాడు. ప్రస్తుతం మహేష్ షేర్ చేసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మహేష్ ఇంత హెల్తీ ఫుడ్ తింటారు కాబట్టి అలా ఉంటాడని… ఆ టిప్స్ మనం కూడా ట్రై చేయాలి.. అప్పుడే ఫీట్ గా ఉంటమని కామెంట్లు చేస్తున్నారు.