కేపి చౌదరికి సురేఖ‌వాణి , కూతుర్ని కూడా… హాట్‌టాపిక్‌గా త‌ల్లికూతుర్లు..!

టాలీవుడ్ లో మరోసారి మాద‌క ద్ర‌వ్యాల రాకెట్ గుట్టు రట్టయింది. ఈ దందా వెనుక ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. కబాలి తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి సాగించిన ఈ దందా వెనక ఉన్న వారి జాబితాను కూడా పోలీసులు విడుదల చేశారు. ఇత‌డి దగ్గర్నుంచి మాద‌క ద్ర‌వ్యాలు కొనుగోలు చేసిన వారి జాబితా తమ దగ్గర ఉన్నట్లు.. అంతే కాకుండా వారి ఫోటోలు కూడా బయటపడ్డాయని వారు చెప్పుకొచ్చారు.

ఇలా వారు చెప్పిన వారిలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు, నటీమణులు కూడా కేపీ చౌదరితో భాగమయ్యారని వారు చెప్పుకొచ్చారు. విచారణలో ఉన్న కేపీ చౌదరిని లోతుగా ప్రశ్నించిన పోలీసులు ఎవరెవరున్నారు అన్ని బయటపెట్టేసాడు. ఈ సమయంలోనే తాజాగా సినీనటి సురేఖ వాణి తో పాటు తన కూతురు సుప్రీతా కూడా కేపి చౌదరితో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

గతంలో జరిగిన ఒక పార్టీలో సురేఖ వాణి అతనికి ముద్దు పెడుతున్న ఫోటో ఒకటి బయటకు రాగా.. అలాగే మరో ఫోటోలో సురేఖ కూతురు సుప్రతా కూడా కేపి చౌదరిని కౌగిలించుకొని ఉంంది. ఇక ఇప్పుడు దీంతో ఈ తల్లి కూతుర్లకు కూడా ఈ దందాలో లింక్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అతడితో ఇద్దరికీ ఉన్న రిలేషన్ ఏంటి ? అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది.

సురేఖ వాణి గ‌తంలోనూ ప‌బ్బుల్లో పార్టీల్లో ఎంజాయ్ చేస్తోన్న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇక త‌న కుమార్తెతో ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోల‌తో ద‌ర్శ‌న‌మిస్తూ ఉంటుంది. ఇప్పుడు మాద‌క ద్ర‌వ్యాల‌తో లింక్ ఉన్న వ్య‌క్తితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో ఆమెను చాలా మంది సందేహిస్తున్నారు.

కేపీ చౌదరి తప్పు చేసినంత మాత్రాన అతడితో ఫోటోలు దిగినవారు కూడా తప్పు చేసి ఉంటారని ఎలా చెబుతారని కోంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఏదేమైనా సురేఖావాణి రెస్పాండ్‌ అయితే కానీ అసలు విషయం బ‌య‌ట‌కు రాదు. ఇక సురేఖ వాణి ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి .