సుహాసిని కి ఆ హీరోయిన్ అంటే అంత కోపమా..? ఏకంగా పెళ్లినే చెడగొట్టాలని చూసిందా..!?

80వ దశకంలో సౌత్ చిత్ర పరిశ్రమలో తమ అందచందాలతో ఒక ఊపు ఊపిన హీరోయిన్లలో సుహాసిని, సుమలత, రాధా ,రాధిక, శ్రీదేవి, జయప్రద వంటి హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తాయి. వారిలో సుహాసిని, సుమలత కూడా తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నారు. అయితే అప్పట్లో సుహాసిని తన తోటి హీరోయిన్ అయినా సుమలత పెళ్లి జరగకుండా చేసిందట. మరి ఆ హీరోయిన్ పెళ్లి చెడగొట్టడానికి అసలు కారణం ఏంటి సుహాసినీకి – సుమలత పై ఉన్న పగ ఏంటి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

సీనియర్ హీరోయిన్ సుహాసిని సౌత్ స్టార్ట్ డైరెక్టర్ మణిరత్నంని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే సుమలత కూడా కన్నడ స్టార్ హీరో దివంగత నటుడు అంబరీష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సుమలత- అంబరీష్‌ల‌ పెళ్లి వీరిద్దరి ఇష్ట ప్రకారమే జరిగినప్పటికీ వీరి పెళ్లి జరగకుండా చూడాలని సుహాసిని ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారట. అంతేకాకుండా సుహాసిని సుమలత దగ్గరికి వెళ్లి అంబరీష్ నీకు అంతగా సెట్ అవ్వడు అతని ప్రేమించడం మానేస్తే నీకే మంచిది..పెళ్లి చేసుకుంటే నీ జీవితం నాశనం అవుతుంది అని కూడా ఆమెకు చెప్పేదట.

కానీ సుమలత మాత్రం తన ప్రేమ పై ఉన్న నమ్మకంతో అంబరీష్ ని పూర్తిగా నమ్మటంతో ఆయన ప్రేమలో పడిపోవడంతో సుహాసిని ఎంత చెప్పినా అసలు ఏమి పట్టించుకోలేదట. ఇదే సమయంలో సుమలత- అంబరీష్ ని పెళ్లి చేసుకుంటే సుహాసిని కి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అందరికీ అనుమానం రావచ్చు.. ఇక ఇందులో సుహాసినికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ సుమలత ఎంతో అమాయకురాలు అలాగే సున్నిత మనస్తత్వం కలిగింది. కానీ అంబరీష్ మాత్రం చూడ్డానికి రౌడీలా కనిపిస్తూ చాలా రోగ్గా ఉంటాడు. అలాంటి వీరిద్దరికి పెళ్లి జరిగితే సుమలత అసలు హ్యాపీగా ఉండా లేదని ఉద్దేశంతో సుహాసిని వీరి పెళ్లి జరగకుండా చూడాలని భావించేదట.

ఇక సుహాసిని ఎంత చెప్పినా కూడా సుమలత తను ప్రేమించిన అంబరీష్ ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి జరిగాక వీరిద్దరి ఎంతో అన్యోన్యంగా ఎంతో హ్యాపీగా ఉన్నారు. అదే స‌మ‌యంలో సుహాసిని, సుమలత ఇంటికి వెళ్లినప్పుడు అంబరీష్‌ స్వయంగా ఏంటమ్మా సుహాసిని నాపై నీకు ఎందుకు అంత పగ మీ స్నేహితురాలని నన్ను చేసుకోవద్దని చాలానే చాడీలు చెప్పావట అంటూ అంబరీష్ అడిగారట. కానీ నేను మీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను అందుకే సుమలత చాలా అమాయకురాలు కదా అని వద్దని చెప్పాను అంతేగాని పెళ్లి జరగకూడదని నాకు ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ చెప్పిందట. ఇక అయితే ఇదే విషయాన్ని స్వయంగా సుమల‌త‌ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది.