యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తాడో తెలిసిందే. మూవీస్ షెడ్యూల్ విరామంలో ఏమాత్రం ఖాళీ దొరికినా ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తుంటాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’ షూటింగ్ గ్యాప్ దొరకడంతో తన ఫ్యామిలీని తో పాటు విదేశాలకు పయనమయ్యాడు. తారక్ ఫ్యామిలీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించడంతో ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోస్ లో తారక్ – లక్ష్మీ ప్రణతి దంపతులు వారితో పాటు పిల్లలు భార్గవ్ అభయ్ రామ్ కూడా చాలా క్యూట్ లుక్స్ లో కనిపిస్తున్నారు. చిన్న కొడుకు భార్గవరామ్ అయితే తండ్రి చేయి పట్టుకొని విమానాశ్రయంలో అల్లరి అల్లరి చేశాడు . బుడిబుడి అడుగులు వేస్తున్నాడు . కాగా నిజానికి తారక్ షెడ్యూల్లో ఈ ఫారిన్ వెకేషన్ లేదట . కానీ తన కొడుకు స్కూల్ ఓపెన్ అవుతూ ఉండడంతో ఈలోపే తన కొడుకు హాలిడేస్ ని ఎంజాయ్ చేయాలన్న క్రమంలో షూటింగ్ కి బ్రేక్ వేసి మరి తారక్ రాత్రికి రాత్రి వెకేషన్ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది.
అయితే ఈ ట్రిప్ పై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై మరో రకమైన విమర్శలు కూడా వస్తున్నాయి.. మే 20న హైదరబాద్‌లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలలో తారక్ కనిపించలేదు.. కానీ ఈ కార్యక్రమాల్లో మెగా కుటుంబం నుంచి రామ్ చరణ్ వచ్చి ఎన్టీఆర్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఎన్టీఆర్ గారితో తన చిన్నప్పటి అనుభవాలను కూడా అక్కడ గుర్తు చేసుకున్నాడు చరణ్. ఇప్పుడు దీంతో మహానుభావుడు మనవడైన జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అంటూ సోషల్ మీడియాలో తెగ చర్చ కూడా జరిగింది. అంతేగాండా ఈ వార్తలపై ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ఆర్గనైజర్ టిడిపి నేత టీజీ జనార్ధన్ కూడా స్పందించారు.
‘‘ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూ. ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఇవ్వాలని మేము ప్రయత్నించాం. కానీ ఆయన వారం రోజుల తర్వాత మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. పోనిలేనని వెళ్లి ఆయన్ను కలిసి విషయం చెప్పాం. కానీ ముందుగానే తనకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయి ఉన్నాయని ఎన్టీఆర్ అన్నారు. 22 ఫ్యామిలీలతో కలిసి వెకేషన్‌కు వెళుతున్నాం అన్నారు. శత జయంతి అనేది ఒకసారి మాత్రమే వస్తుంది కదా రండి అని కూడా మేము చెప్పాం. కానీ ఆయనకు షెడ్యూల్ కుదరలేదేమో.. రాలేదు. మేం చెప్పాల్సింది చెప్పాం. ఆయన నిర్ణయం ఆయన తీసుకున్నారు.’’
ఇక ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు కూడా కూసింత ఘాటగానేే స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ ను కావాలనే ఆలస్యంగా పిలిచారని అది కూడా మొక్కుబడిగా పిలిచారంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఆ కారణంగానే ఎన్టీఆర్ ఆ కార్యక్రమానికి రాలేకపోయారని, తారక్‌ను రాజకీయంగా ముందుకు రాకుండా ఆపాలని చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ అని.. ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కానీ ఎప్పటికైనా తెలుగుదేశం పగ్గాలు చేపట్టేది ఎన్టీఆర్‌యేనని అంటున్నారు. కానీ చిన్న వెకేషన్ ఎన్టీఆర్‌కు మాత్రం పెద్ద చిక్కులే తెచ్చిపెట్టింది. మరి దీనిపై ఎన్టీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.