స్టార్ సింగ‌ర్‌ను రాత్రంతా త‌న‌తో గ‌డ‌ప‌మ‌న్న స్టార్ డైరెక్ట‌ర్‌… ఆ రోజు ఏం జ‌రిగింది…!

సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ … ఇబ్బంది ఉంటూనే ఉంది. చాలామంది సెలబ్రిటీస్ గత కొంతకాలంగా మీటు ఉద్యమం పేరుతో వారిపై జరిగిన క్యాస్టింగ్ కౌ… అనుభవాలను షేర్ చేసుకుంటూ వస్తున్నారు. మరి కొంతమంది సోషల్ మీడియా పోస్టులతో వారి ఎక్స్పీరియన్స్ తెలుపుతున్నారు. ఇక తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ సింగర్ తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. ఆమె ఎవరో కాదు సుచిత్ర కృష్ణమూర్తి.

బాలీవుడ్‌లో నటిగా, సింగర్‌గా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న సుచిత్ర కృష్ణమూర్తి తనకంటే 30 ఏళ్ల పెద్ద వాడిని వివాహం చేసుకుంది. తర్వాత కొన్ని కారణాలతో వీళ్లు విడాకులు తీసుకున్నారు. ఇక సుచిత్ర కృష్ణమూర్తి కూడా తన జీవితంలో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌ.. అనుభవాన్ని చూసిందట. అప్పట్లో ముంబై ఆడిషన్స్ అన్ని హోటల్స్ లోనే జరిగేవట‌.. అలా ఆమె ఓ సినిమా ఆడిషన్స్ లో పాటిస్పేట్ చేయగా తాను సెలెక్ట్ అయ్యాన‌ని తెలిపింది.

దీనిపై ఆమె మాట్లాడుతూ ఆ డైరెక్టర్ నువ్వు ఎవరితో క్లోజ్ గా ఉంటావు అని అడిగాడని.. మా నాన్నతో అని చెబితే అయితే ఇక్క‌డ అడిష‌న్లు ఉన్నాయి… రేపు ఉదయం వరకు ఇంటికి రానని ఫోన్ చేసి చెప్పేయ్ అన్నాడని చెప్పుకొచ్చింది. అప్పటికే సాయంత్రం 5 గంటలు అవడంతో రేపు ఉదయం అంటే రాత్రంతా ఇతడితో ఉండాలా ? అని ఆలోచించాన‌ని తెలిపింది.

అతడి ఉద్దేశం నాకు అర్థమైందని.. భయం వేసి అక్కడ నుంచి తప్పించుకుని వచ్చేసానని చెప్పుకొచ్చింది. ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కాపురం నాశనం అవ్వడానికి ప్రీతిజింతానే కారణం అంటూ ఆమె కారణంగానే భర్తకు విడాకులు ఇచ్చానంటూ చెప్పుకొచ్చింది సుచిత్ర కృష్ణమూర్తి.