బ‌న్నీ బ్యాడ్ సెంటిమెంట్ దెబ్బ‌తో బ‌లైపోయిన స్టార్ హీరోయిన్లు..!

ఇండ‌స్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు కొంద‌రికి మైన‌స్‌గా మారుతూ ఉంటాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాల‌తో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన కొంద‌రు హీరోయిన్లు అస్స‌లు అ్ర‌డ‌స్ లేకుండా పోయారు.
గౌరీ ముంజాల్ ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తర్కెక్కిన ‘ బన్నీ ‘ సినిమాతోనే గౌరీ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

తొలి సినిమా పెద్ద హిట్ కావ‌డంతో గౌరీ ముంజాల్ స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. బన్నీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం గౌరీ తెలుగులో శ్రీ కృష్ణ , గోపి, భూకైలాస్, కౌసల్య సుప్రజ రామ, బంగారుబాబు వంటి సినిమాల్లో నటించిన ఆ త‌ర్వాత వ‌రుస డిజాస్ట‌ర్ల‌తో అడ్ర‌స్ లేకుండా పోయింది.

ఆర్య సినిమాల్లో నటించిన హీరోయిన్ అయిన‌ ‘ అను మెహతా ‘ కూడా ఇండస్ట్రీ కి దూరం అయింది. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య‌ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ త‌ర్వాత అనూకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. అల్లరి నరేష్ తో ‘ నువ్వంటే నాకిష్టం ‘ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఆమె ఏ సినిమాలోనూ కనిపించలేదు.

గుణశేఖర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘ వరుడు ‘ సినిమాలో హీరోయిన్ గా చేసిన భాను శ్రీ మెహ్రా కూడా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో కనిపించిన కూడా ఏ ఒక్క సినిమాకి హిట్స్ రాకపోవడంతో సినీ ఇండస్ట్రీకి దూరమైంది. అల్లు అర్జున్ ఏదైనా కొత్త హీరోయిన్ తో సినిమా చేస్తున్నాడు అంటే ఆ తరువాత ఆ హీరోయిన్ సినీ ఇండస్ట్రీకి దూరమైన‌ట్టే..!