ఎస్ ప్రజెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుని వివాహం చేసుకున్న తర్వాత మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఈ లిస్టులో కలర్స్ స్వాతి చేరిపోయిందంటూ సమాచారం అందుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన కలర్స్ స్వాతి ఎప్పుడు గ్లామర్ షోకు దూరంగా ఉంటూ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తు మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాంట్రవర్షల్ మ్యాటర్స్ కు దూరంగా ఉంటూ కామ్‌గా తన పని తాను చేసుకుంటూ పోయే కలర్స్ స్వాతి తన క్లోజ్ ఫ్రెండ్ వికాస్ నీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వికాస్‌తో ఎంతో కాలంగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న స్వాతి స్వయంగా చాలా ఇంటర్వ్యూలో తనే ఈ విషయాని వివరించింది. అలాంటిది సడన్‌గా స్వాతి విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా కలర్ స్వాతి హైదరాబాద్ షూటింగ్లో బిజీగా ఉంటుంది. భర్త థాయిలాండ్ లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
కలర్ స్వాతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భర్తతో కలిసి దిగిన ఫొటోస్ ని, అలాగే పెళ్లి ఫొటోస్ డిలీట్ చేసింది. గత కొంతకాలంగా విడాకులు తీసుకోబోతున్న టాప్ సెలబ్రిటీస్ అందరూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ముందు సమంత, తర్వాత నిహారిక కూడా వారి భర్తల ఫొటోస్ ని అకౌంట్ నుంచి డిలీట్ చేసి భర్తల అకౌంట్లో బ్లాక్ చేశారు. అదే దారిలో స్వాతి కూడా వెళ్లడంతో ఆమె కూడా విడాకులు తీసుకోబోతుందంటూ వార్తలు వినపడుతున్నాయి. దీంతో కలర్స్ స్వాతి అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. ఈ వార్తలు నిజం ఎంత ఉందో తెలియాలంటే కలర్స్ స్వాతి నోరు విప్పాల్సిందే.