పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి.. ఆయన ఫాలోయింగ్ గురించి.. రేంజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమా వస్తోందంటే చాలు ఆయన అభిమానులు థియేటర్ల ముందు.. సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతా ఇంతా కాదు.. అంతలా పాపులారిటీ దక్కించుకున్న ఆయనకు ఒక్క సామాన్య ప్రేక్షకులే కాదు సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే ఇంస్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
జూలై 4వ తేదీన ఎలుగెత్తు.. ఎదిరించు.. ఎన్నుకో.. జైహింద్ అంటూ ఒక బయోతో తన ఇన్ స్టా ఖాతాను ఓపెన్ చేశారు పవన్ కళ్యాణ్ . అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఖాతాను ఆయన పీ ఆర్ టీమ్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అలా ఇన్ స్టా ఖాతా ఓపెన్ చేశారో లేదో దెబ్బకు ఇన్స్టాలో ఫాలోవర్స్ భారీగా పెరిగిపోయారు. ప్రస్తుతం ఆయనను అనుసరిస్తున్న ఫాలోవర్స్ సంఖ్య సుమారుగా 2.3 మిలియన్లకు పైగానే చేరిపోయింది.
మరొకవైపు పవన్ కళ్యాణ్ ఇన్స్టాలో మొదటిగా ఎలాంటి పోస్ట్ పెట్టబోతున్నారు అనే విషయంపై ఫాలోవర్లు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఆయన మొదటి పోస్ట్ పెడితే ఈ ఫాలోవర్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ ను ఇన్స్టా లో ఫాలో అవుతున్నారు. అందులో స్టార్ హీరోయిన్లు కూడా ఉండడం విశేషం.
ముఖ్యంగా శృతిహాసన్, కీర్తి సురేష్ తో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఆయనను ఇన్ స్టాగ్రామ్ లో అనుసరిస్తూ ఉండడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే సాయిధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో చిత్రం ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది ఇక ఈ సినిమాతో పాటు ఉస్తాధ్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాలలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.