వ‌య‌సులో త‌మ‌కంటే పెద్దోళ్లు అయిన భార్య‌ల‌ను చేసుకున్న స్టార్ హీరోలు..!

భార్యాభర్తలుగా మగవారి కంటే ఆడవాళ్ళకి తక్కువ వయసు కలిగి ఉండాలనేది మన సాంప్రదాయం. ఇప్పటికీ అదే సాంప్రదాయం త‌ర‌త‌రాలుగా కొనసాగిస్తున్నారు. కొందరు మాత్రం వయసుతో సంబంధం లేకుండా తమ మనసుకు నచ్చిన అమ్మాయిని ఏరి కోరి వివాహం చేసుకుంటున్నారు. ఇలాంటివి ఎక్కువగా సినీ ఇండస్ట్రీలోనే జరుగుతున్నాయి. ఆ లిస్టులో చాలామంది సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం.

సచిన్ టెండూల్కర్:
భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్టార్ క్రికెట‌ర్ సచిన్ తనకన్నా ఐదేళ్లు పెద్దదైన అంజలీని ఏరికోరి వివాహం చేసుకున్నారు.

మహేష్ బాబు:
టాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌ మహేష్ బాబు తనకంటే వయసులో పెద్దదైన నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంప‌తుల‌కు ఓ కొడుకు, కూతురు కూడా ఉన్నారు.
సైఫ్ ఆలీ ఖాన్‌:
బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సైఫ్ ఆలీఖాన్‌ తనకంటే వయసులో చాలా పెద్దదైన అమృతా సింగ్ ను వివాహం ఆడారు. ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టాక ఆమెకు విడాకులు ఇచ్చేసి.. వ‌య‌సులో త‌న‌కంటే చాలా చిన్న‌ది అయిన క‌రీనాక‌పూర్‌ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

అభిషేక్ బచ్చన్:
బాలీవుడ్ స్టార్ అమితాబ‌చ్చ‌న్ ముద్దుల త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ తనకంటే వయసులో రెండేళ్లు పెద్దదైన ఐశ్వర్యారాయ్‌ను వివాహం చేసుకున్నారు.
శిల్పా శెట్టి:
సీనియ‌ర్ హీరోయిన్ శిల్పాశెట్టి తనకంటే చిన్నవాడైనా రాజుకుంద్రాను వివాహం చేసుకుంది.

ప్రియాంక చోప్రా:
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక‌చోప్రా తనకంటే 11 ఏళ్ళు చిన్నవాడైనా నీక్ జోనోస్ ని వివాహమాడింది.
అనుష్క శర్మ:
అనుష్క తన కంటే 6 నెలలు చిన్నవాడైన విరాట్ కోహ్లీ ని వివాహం చేసుకుంది.