రమ్యకృష్ణ టు వైష్ణవి చైతన్య.. హీరోలను దారుణంగా మోసం చేసిన హీరోయిన్లు వీళ్లే..!

ప్రస్తుతం టాలీవుడ్ ని ఒక ఊపు ఊపుతున్న సినిమా బేబీ. వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ కొట్టి బ్రేక్ ఈవెంట్ టార్గెట్ దాటిపోయింది. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య అనేక రకాల వైవిధ్యమైన పాత్రల్లో నటించింది. గల్లి అమ్మాయిగా నటిస్తూనే ఒక అబ్బాయిని ప్రేమించి మరో అబ్బాయిని కూడా ప్రేమిస్తున్నట్టు మోసం చేసింది. చివరికి ఇద్దరినీ పెళ్లి చేసుకోకుండా పెద్దలు చూసిన అబ్బాయితో వివాహం చేసుకొని వెళ్లిపోతుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా యూట్యూబ్, ఇన్ స్టా ఇలా సోషల్ మీడియా వేదికలన్నిటిలోనూ బేబీ మీమ్స్, ట్రోల్స్ కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో మొదలుకొని నెగటివ్ స్టేట్స్‌లో హీరోయిన్లు నటించి హీరోల‌ని మోసం చేసిన సినిమాలు అన్ని సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. రమ్యకృష్ణ నటించిన ‘ ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు ‘ సినిమా నుంచి మొదలుకొని ‘ బేబీ ‘ సినిమా వరకు ఇలా మగవాళ్ళను మోసం చేసే రోల్స్ ప్లే చేసిన హీరోయిన్స్ ఎంతమంది? అవి ఏయే సినిమాలో ఒకసారి చూద్దాం.

తాజాగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా, ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య అమ్మాయిలు అబ్బాయిలను ఎలా ? మోసం చేసి వేరొకరితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారో కళ్ళకు కట్టినట్లుగా నటించి చూపించింది. ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. రమ్యకృష్ణ హీరోయిన్గా, శ్రీకాంత్ హీరోగా నటించిన ‘ ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు ‘ ఇందులో రమ్యకృష్ణ.. శ్రీకాంత్ అన్నయ్యను ప్రేమించినట్టు నటించి మోసం చేస్తుంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధించింది.

పాయల్ రాజ్ పుత్ హీరోయిన్గా కార్తికేయ హీరోగా నటించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో కూడా పాయల్ రాజ్ పుత్ కార్తికేయను మోసం చేసి అతడితో అవసరం తీరిన తర్వాత వేరే అబ్బాయిని ప్రేమించి వివాహం చేసుకుంటుంది. తర్వాత వచ్చిన సినిమా డీజే టిల్లు.. నేహా శెట్టి ఇందులో రాధిక పాత్రను పోషించి హీరోను మోసం చేస్తుంది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది.

‘ ప్రేమించాను నిన్నే ‘ అనే సినిమాలో శ్రీదేవి నెగటివ్ రోల్ లో నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకుంది. ధనుష్ హీరోగా నటించిన ‘ ధర్మ యోగి ‘ సినిమాలో ధనుష్ డ్యూయల్ రూల్ ప్లే చేశాడు. ఈ సినిమాలో త్రిష.. ధనుష్‌ను ప్రేమించినట్టు మోసం చేసిన అమ్మాయి పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ‘ నీ వెవరు ‘, ‘ గుండెల్లో గోదావరి ‘ సినిమాలలో తాప్సీ కూడా హీరోలను మోసం చేసింది.

రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి. ఇక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘ బస్ స్టాప్ ‘ సినిమాలో యాక్టర్స్ ఆనంది సీమా రోల్లో ఒక అబ్బాయిని మోసం చేస్తుంది. ‘ మన్మథ‌ ‘ మూవీలో సింధుతులాని వైష్ణవిగా హీరోని మోసం చేసే పాత్రలో నటించింది. ‘ త్రిష లేదా నయనతార ‘ సినిమాలో అబ్బాయిని మోసం చేసిన రోల్‌ను మనిషా రోప్లే చేసింది. ఇలా ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి.