దర్శకధీరుడు రాజమౌళి సినిమా వస్తుందంటే చాలు రిలీజ్ కి రెండు సంవత్సరాల ముందు నుంచి ఇండస్ట్రీలో లెక్కలేనన్ని గుసగుసలు మొదలవుతాయి. ఆయన సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి రిలీజ్ అవ్వడానికి దాదాపు రెండు మూడు సంవత్సరాలు పడుతుంది. ఎంత లేట్ అయినా సరే సినిమాకు క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు రాజమౌళి.
ఇటివల వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రాజమౌళి కూడా తన కెరియర్ స్టార్టింగ్‌లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాజమౌళి డైరెక్టర్ గా వర్క్ చేసిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ రాఘవేంద్రరావు చేశారు.
ఈ సినిమా రిలీజై సూపర్ సక్సెస్ సాధించింది. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది రాజమౌళి అయినా కేవలం రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వల్లే సినిమా హిట్ అయిందంటూ.. రాజమౌళి టాలెంట్ ఏమీ లేదంటూ ప్రచారం జరిగింది. ఇండస్ట్రీలో కావాలనే కొందరు ఈ ప్రచారం చేశారు. ఆ తర్వాత మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబోలోనే వచ్చిన సింహాద్రి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద రికార్డును సృష్టించిందో చూసాం.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ తో దూసుకుపోయారు ఎన్టీఆర్, రాజమౌళి. కాగా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు దర్శకత్వం వహించింది రాజమౌళి అయినా రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణతో క్రెడిట్ మొత్తం ఆయనకు దక్కింది. ఇలా పరోక్షంగా రాజమౌళి రాఘవేంద్రరావు కారణంగా ఎన్నో అవమానాలు ఎదుర్కున్నా సింహాద్రి సినిమాతో తనపై వచ్చిన విమర్శలకు పూర్తిగా చెక్ పెట్టేశాడు.