సాధ్యం చేసి చూపించావ్ నాగ్ అని ప్ర‌శంసిస్తూనే క‌ల్కిపై ఆ డౌట్ రైజ్ చేసిన రాజ‌మౌళి..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే కలిసి నటించిన కల్కి 2898 AD సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా అమెరికాలో జరుగుతున్న కామికాన్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. మేకర్స్ టైటిల్ తో పాటు హాలీవుడ్ సినిమాను తలపించేలా గ్లింప్స్‌ వీడియో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ క్లిప్స్ లో విజువల్స్ చూసిన ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.

అసలు ఒక్కొక్కరి బ్రెయిన్ చెదిరిపోయే రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. తాజాగా ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర ట్విట్ చేశారు. గ్రేట్ జాబ్ నాగి.. అండ్ వైజయంతి మూవీస్ భవిష్యత్తుపై సినిమాలు తెరకెక్కించటం చాలా కష్టమైన పని.. కానీ మీరు ఆ సాహసం చేశారు.. అంతేకాదు అసాధ్యం అనుకున్న దానిని సాధ్యం చేసి చూపించారు. ఇందులో డార్లింగ్ లుక్ అదిరిపోయింది.. కానీ ఒక్క ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది.. అదే రిలీజ్ డేట్ అంటూ ట్విట్ చేశారు.

ఏది ఏమైనా బాహుబలి, త్రిబుల్ ఆర్‌ సినిమాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ఇండియన్ సినిమా ఎల్లలు దాటించేసి ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప దర్శకుడుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు రాజమౌళి. మళ్లీ ఇప్పుడు అదే తెలుగు సినిమా నుంచి రాజమౌళి స్థాయి టేకింగ్ తో నాగ్ అశ్విన్ కల్కి సినిమాను తెరకెక్కిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఏది ఏమైనా రోజుకు తెలుగు సినిమాఖ్యాతి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకోవటం గర్వకారణం.