“నీకు ఆ అలవాటు ఉందా..?”.. నెటిజన్ వింత ప్రశ్నకు శ్రుతిహాసన్ దిమ్మతిరిగిపోయే ఆన్సర్..!!

తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నటి శ్రుతి హాసన్‌. ఈ తార ప్లే బ్యాక్ సింగర్ గా కూడా బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్ట్రెస్ కమల్‌హాసన్‌ వారసురాలుగా సినిమా ఇంట్రెస్ట్ లోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత తన టాలెంట్ తోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అయితే ప్రొఫెషనల్ లైఫ్‌లో ఈ ముద్దుగుమ్మ చాలా డెడికేటెడ్‌గా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు ఎల్లప్పుడూ టచ్ లో ఉంటుంది.

Shruti Hassan Is Excited To Explore Script Writing, Says; 'It's Been A  Dream Of Mine' - News18

అప్పుడప్పుడు ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా నిర్వహిస్తూ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యాన్స్ క్వశ్చన్లకు సమాధానం చెప్పింది. ఈ సమయంలోనే ఆమెకు ఒక వింత ప్రశ్న ఎదురయింది. సాధారణంగా వేరే హీరోయిన్ అయితే ఈ ప్రశ్న దాటవేసేది. కానీ శ్రుతి కాబట్టి ఈ ప్రశ్నకు చాలా బోల్డ్‌గా, పబ్లిక్‌గా ఆన్సర్ చెప్పి అందరి చేత దటీజ్ శ్రుతిహాసన్ అనిపించుకుంది.

ఇంతకీ ఆ నెటిజన్ అడిగిన ప్రశ్న అడిగిన ప్రశ్న ఏంటంటే, “మీరు మద్యం తాగుతారా?” అని సూటిగా ప్రశ్నించాడు. దానికి ఈ గబ్బర్ సింగ్ నటి సమాధానం ఇస్తూ ” నేను మద్యం తీసుకోను, డ్రగ్స్ కి కూడా దూరంగా ఉంటాను” అని చాలా హుందాగా తెలిపింది. ఈ ఆన్సర్ విన్న తర్వాత శ్రుతి పట్ల తమకు చాలా గౌరవం పెరిగిందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.

Shruti Haasan reveals she said 'I love you' first to boyfriend Santanu.  Watch | Bollywood - Hindustan Times

ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్‌ జంటకు భారీ చిత్రం సలార్‌ లో ఈ అమ్మడు నటిస్తోంది. ఇది తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో త్వరలోనే రిలీజ్ కానుంది.