వామ్మో శ్రీలీల‌కు ఆమెతో అలాంటి కోరిక ఉంద‌ట‌..!

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చలామణి అవుతుంది శ్రీ లీల. ప్ర‌స్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వ‌ర‌కు త‌మ సినిమాల్లో శ్రీలీల‌నే హీరోయిన్‌గా కోరుకుంటున్న‌రు. ఇక ఈమె క్రేజ్ చూస్తుంటే మరికొన్ని రోజులైతే బాలీవుడ్ కి కూడా వెళ్తుంది కావచ్చు అనేలా ఉంది ఈమె స్టార్‌డ‌మ్‌.

ఇక దీనికి తోడు ఇటీవల ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన వేణు స్వామి శ్రీ లీల గురించి జోష్యం చెబుతూ ఈమె కేరీర్ ముందు ముందు చాలా అద్భుతంగా ఉండబోతుందని.. రాబోయే 6,7 సంవత్సరాల్లో మిగతా స్టార్ హీరోయిన్లు అందరిని తొక్కేసి మరి స్టార్‌డమ్‌ని కొనసాగిస్తుందని వ‌రుస‌ ఆఫర్లతో పాటు డబ్బు దానంతట అదే శ్రీలీల చెంతకు చేరుతుందని జోష్యం చెప్పాడు. ఇప్పటికే 12 సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని మంచి ఫామ్‌లో ఉంది శ్రీ లీల. ఇలాంటి నేపథ్యంలో శ్రీ లీలకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే శ్రీలీల గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు బయటకు వ‌చ్చాయి. కానీ శ్రీలీలకు ఇండస్ట్రీలో ఉండే ఆ హీరోయిన్లు అంటే చాలా ఇష్టమట. ప్ర‌స్తుతం ఇదే విష‌యం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ట్రెడిషనల్ హీరోయిన్లు గా గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న సావిత్రీ, సౌంద‌ర్య, సాయి ప‌ల్ల‌వి ఈ ముగ్గురు హీరోయిన్లు అంటే శ్రీ లీలకు ఎంతో ఇష్టమట.

ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్ అయినా సాయి పల్లవితో ఎలాగైనా ఓ సినిమాలో నటించాలని శ్రీ లీల కోరుకుంటుందట. అలాగే సాయి పల్లవి డాన్స్ అంటే త‌నకు ఎంతో ఇష్టమని శ్రీ లీల బయటకు చెప్పడంతో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క సాయి పల్లవి టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపడం లేదంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో శ్రీ లీలకు సాయి పల్లవి తో నటించే అవకాశం వస్తుందో లేదో అనే సందేహం ఫ్యాన్స్ లో మొదలైంది.