ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీ నటి ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినపడుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నన్ని క్రేజీ ప్రాజెక్టులు ఎవ్వరి చేతుల్లోనూ లేవు. ఇటు బాలయ్య భగవంత్ కేసరి, మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలోనూ నటిస్తోంది. దీంతో పాటు ఆమె చేతిలో ఐదారు సినిమాలు లైన్లో ఉన్నాయి. మరో మూడు, నాలుగు ప్రాజెక్టులపై చర్చలు కూడా జరుగుతున్నాయి.
ఇక ఈ రోజు ఈ బ్యూటీ పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తోన్న సినిమాల నుంచి ఆమెకు విషెస్ చెపుతూ అదిరిపోయే పోస్టర్లు రిలీజ్ అయ్యాయి. బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్నభగవంత్ కేసరి నుంచి ఆమెకు విషెస్ చెపుతూ రిలీజ్ అయిన శ్రీ లీల ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
అలాగే మహేష్‌బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం సినిమాలోనూ శ్రీలీలే హీరోయిన్. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సూపర్‌పోస్టర్‌లో అయితే త్రివిక్రమ్ మార్క్ గ్లామర్‌తో కనిపిస్తోంది. అలాగే ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో స్టెప్పులు వేయనుంది. తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.
దీనికి సంబంధించి శ్రీలీల పుట్టిన రోజు కానుకగా ఈ రోజు పోస్టర్‌ను విడుదల చేశారు. వీరిద్దరూ కలిసి డాన్స్ చేస్తోన్న స్టిల్లే అదిరిపోయింది. రేపు నిజంగానే వీరిద్దరు కలిసి డ్యాన్స్ చేసిన వీడియో రిలీజ్ అయితే సినీ లవర్స్‌కు అంతకన్నా కావాల్సిన ఆనందం ఏం ? ఉంటుంది.