బాల నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రీదేవి తర్వాత పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్‌గా మారి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో సినిమాలు చేసి అతిలోకసుందరిగా దేశం గర్వించదగ్గ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఎవరికైనా అతిలోకసుందరి అనే పేరు వినగనే గుర్తుకొచ్చేది శ్రీదేవి పేరే.. 54 సంవత్సరాల వయసులో దుబాయ్ కి పెళ్లికి వెళ్లి అక్కడ బాత్ టబ్లో జారిపడి చనిపోయిన విషయం అందరికీీ తెలిసిందే.
ఆమె మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే శ్రీదేవి తెలుగులో ఓ స్టార్ హీరో సినిమాలో నటించే సమయంలో ఆమె డైరెక్టర్ కి హీరోకి ఎన్నో కండిషన్లు పెట్టేదట.. అసలు విషయం ఏమిటంటే చిరంజీవి హీరోగా కొండవీటి దొంగ సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముందుగా శ్రీదేవిని హీరోయిన్‌గా అనుకున్నారట దర్శకుడు కోదండరామిరెడ్డి.
ఇక ఇదే విషయాన్ని కోదండరామిరెడ్డి శ్రీదేవి కి చెప్పడంతో కొండవీటి దొంగ టైటిల్ మార్చి ఆ టైటిల్ పక్కన కొండవీటి రాణి అని కూడా పెట్టాలని, అలా పెడితేనే తను ఈ సినిమాలో నటిస్తానని చెప్పిందట. అదేవిధంగా ఈ సినిమాలో హీరో చిరంజీవి కంటే తన క్యారెక్టర్ కి ఎక్కువ ప్రయారిటీ ఉండాలని దర్శకుడు కోదండరామిరెడ్డికి చెప్పడంతో హీరోయిన్గా శ్రీదేవిని పక్కన పెట్టి మరో స్టార్ హీరోయిన్ విజయశాంతి, రాధలను హీరోయిన్లుగా తీసుకున్నారు. ఆ తర్వాత సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.
ఇక అదే విధంగా చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా చేసే సమయంలో కూడా శ్రీదేవి ఇలాంటి తరహా కండిషన్లు పెట్టిందట. అందుకే దర్శకుడు రాఘవేందర్రావు తెలివిగా ఆలోచించి ఈ సినిమా టైటిల్ పక్కన అతిలోకసుందరి అనే పేరును కూడా చేర్చారట. ఆ రోజుల్లో చిరంజీవికి జంటగా నటించే సమయంలో శ్రీదేవి కండిషన్ లు విని చాలామంది దర్శక- నిర్మాతలు ఈ హీరోయిన్ కి ఇంత తలపోగరా..? అంటూ ఆమెతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వారు కాదట..!!