ఆదిపురుష్ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి గెటప్‌లో నటించిన విషయం తెలిసిందే. దీంతో గతంలో రాముడి పాత్రల్లో నటించిన టాలీవుడ్ హీరోలను చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఎంతోమంది టాలీవుడ్ హీరోలు రాముడిగా కనిపించి స్క్రీన్‌పై అలరించారు. రాముడి పాత్రల్లో నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారు. సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు చాలామంది వెండితెరపై రాముడిగా కనిపించారు. ఇప్పటివరకు టాలీవుడ్‌లో రాముడి పాత్రలో నటించిన హీరోలు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందామా..?
యడమల్లి సూర్యనారాయణ తొలిసారిగా తెలుగు వెండితెరపై రాముడిగా నటించి మెప్పించారు. పాదుకా పట్టాభిషేకం అనే సినిమాలో ఆయన రాముడిగా కనిపించారు. ఇక 1994లో అదే టైటిల్‌లో మరో సినిమా రాగా.. ఆ సినిమాలో సిఎస్ఆర్ ఆంజనేయుడు రాముడి పాత్రలో కనువిందు చేశారు. ఇక శ్రీ సీతారామం జననం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు రాముడి రోల్‌ను పోషించారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ విషయానికొస్తే.. ఆయన ఒక సినిమాలోనే కాదు.. అనేక సినిమాల్లో రాముడి గెటప్‌లో కనిపించారు.
లవకుశ, రామదాసు, శ్రీరామ పట్టాభిషేకం, శ్రీ రామాంజనేయ యుద్దం సినిమాల్లో సీనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించారు. ఇక సంపూర్ణ రామాయణం సినిమాలో హీరో శోభన్ బాబు రాముడిగా స్క్రీన్‌పై కనిపించారు. ఇక వీరాంజనేయ సినిమాలో కాంతారావు, బాల రామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో నటించారు.
ఇక శ్రీరామదాసు సినిమాలో శ్రీకాంత్, శ్రీరామదాసు సినిమాలో సుమన్ రాముడి గెటప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆక్టటుకోగా.. శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య రాముడి పాత్రలో నటించి ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక సీతారామ కల్యాణం, శ్రీరామకళ సినిమాలో హరినాథ్ రాముడి పాత్రలో నటించి అలరించారు. ఇలా ఎంతోమంది హీరోలు రాముడి పాత్రలో నటించారు.