దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి.. క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అన్న సిద్ధాంతం ఈ తరం జన హీరోయిన్లు బాగా వంటపట్టించుకుంటున్నారు. ఈ తరం హీరోయిన్స్ తమ సినిమాలు ఆడినప్పుడే తమని గుర్తు పెట్టుకుంటారని… లేదంటే అస్సలు పట్టించుకోరని డిసైడ్ అయిపోతున్నారు. పైగా హీరోయిన్ల స్పాన్ మహా అయితే ఐదారేళ్లు మాత్రమే ఉంటుంది.
వాళ్లు ఎక్కువ సినిమాలు చేయాలన్నా… నాలుగు రాళ్లు వెనకేసుకోవాలన్నా ఈ టైంలోనే చేయాలి. అందుకే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు స్టార్ హీరోయిన్స్. ఇండస్ట్రీలో ఒక్కో సీజన్ ఒక్కో హీరోయిన్ హవా నడుస్తుంది. టాలీవుడ్లో మొన్నటిదాకా కృతి శెట్టి తర్వాత మృణాల్ ఠాకూర్ ఇప్పుడేమో శ్రీ లీల అలా ఒక్కో సీజన్లో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తోంది.
శ్రీలీలవి ఏకంగా 10 సినిమాలు రిలీజ్ కానున్నాయి. అన్ని సినిమాలు ఎలా ? మేనేజ్ చేయగలుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ప్రతి ఒక్క హీరోకు డేట్లు ఇస్తోంది. అలాగే రెమ్యూనరేషన్ విషయంలోనూ నో కాంప్రమైజ్ అంటున్న శ్రీ లీల ధమాకాకు ముందు లక్షలు తీసుకుంటే ఇప్పుడు ఏకంగా కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.
అలాగే మృణాల్ ఠాకూర్ అయితే ఏకంగా రు. 2 కోట్లు కావాలంటోంది. నానితో పాటు విజయ్ దేవరకొండ పరశురాం సినిమాల్లోనూ నటిస్తుంది. గ్లామర్ షోపై మొహమాటం లేకపోవడంతో డైరెక్టర్స్ కూడా సినిమాలు ఇస్తున్నారు. ఇంతకుముందు కృతి శెట్టి కూడా అంతకన్నా ఎక్కువే తీసుకుంది. కానీ వరుసగా ఫ్లాప్స్ రావడంతో అసలు ఆమెకు ఛాన్సులు ఇచ్చేందుకే వెనుకాడుతున్నారు. అలాగే ఇప్పుడు శ్రీ లీల హవా నడుస్తుంది. మరి రాబోయే కాలంలో ఇంకా ఏ హీరోయిన్స్ హవా నడుస్తుందో చూడాలి