టాలీవుడ్‌ను షేక్ చేస్తోన్న శ్రీలీలకు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా.. అస్స‌లు ఊహించ‌రు…!

టాలీవుడ్ లోప్రస్తుతం హీరోయిన్ శ్రీ లీల కెరీర్ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ అందరు స్టార్ హీరోలకు జంటగా ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. ఇప్పటివరకు ఈమె నటించిన సినిమాలు రిలీజ్ అయింది రెండే కానీ.. ఇంతటి క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవడానికి కారణం ఈ ముద్దుగుమ్మ మాస్ యాటిట్యూడ్.

ఎలాంటి పాత్ర‌లో అయినా ఇట్టే ఒదిగిపోవ‌డం.. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి.. తెలుగు బాగా మాట్లాడ‌డం… ఇక ఎలాంటి స్టెప్స్ అయినా అవలీలగా వెయ్యగలిగే ఈ ముద్దుగుమ్మతో కలిసి నటించ‌డానికి స్టార్ హీరోలు కూడా ఎంతో ఆరాట‌ ప‌డుతున్నారు. ఇంకా చెప్పాలంటే శ్రీలీల త‌మ సినిమాల్లో ఉంటే త‌మ సినిమా క్రేజ్ పెర‌గ‌డంతో పాటు మార్కెట్ కూడా పెరుగుతోంద‌న్న ఆశ‌లు కూడా హీరోల‌కు వ‌చ్చేశాయి.

దీంతో కోట్లకి కోట్లు పారితోషాకం ఇచ్చి మరి ఈ ముద్దుగుమ్మను తమ సినిమాల్లో బుక్ చేసుకుంటున్నారు. కాగా శ్రీలీల ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలందరితో నటిస్తూ వస్తుంది. ఇలాంటి శ్రీలీలకు ఏ హీరో ఇష్టమన్న‌ విషయం ఇప్పుడు అందరికీ ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీలీల త‌న‌కు చాలామంది హీరోలు ఇష్టం .. చాలామంది యాక్టింగ్ నచ్చుతుంది… అయితే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అంటే తనకు ఎంతో ప్రాణమని.. ఆయనతో కలిసి ఒక్క సినిమాలో నటించాలనుకుంటున్న‌ట్టు చెప్పింది.

శ్రీలీల‌కి సూర్య అంటే ఇష్టమ‌ని చెప్పిన న్యూస్ వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఇంత‌ మంది స్టార్ హీరోలతో నటిస్తున్న సరే కోలీవుడ్ హీరో సూర్య అనే తన ఫేవరెట్ హీరోగా మారటానికి ముఖ్య కారణం ఆయన నటన.. సూర్య చేసే సేవా కార్యక్రమాలు అట‌. శ్రీ లీలకు ఎదుటివారికి కష్టం వస్తే.. సాయం చేసే వాళ్ళు అంటే చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. మన టాలీవుడ్‌లో ఇలాంటి మ‌న‌స్త‌త్వం ఉన్న‌ హీరోలు చాలా తక్కువ. అందుకే బయట ఇండస్ట్రీలో ఉన్న హీరోలను శ్రీలీల‌ బాగా ఇష్టపడుతుంది.