టాలీవుడ్ టాప్‌-1 హీరోయిన్ ఎవరంటే.. ఒక్క దెబ్బ‌తో వాళ్ల‌ను తొక్కి ప‌డేసిందిగా…!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ? స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటారు. ఎప్పుడు ఎవరు ఫేడ‌వుట్ అయిపోతారో ? చెప్పడం చాలా కష్టం. అలానే నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ టాప్ 1 హీరోయిన్గా ఉన్న సమంత.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత నెగటివ్ ట్రోల్స్‌కి గురవడం.. ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో కాస్త వెనకబడింది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 1 స్టార్ హీరోయిన్ ప్లేస్ కోసం స‌హ‌జంగానే కొంద‌రు హీరోయిన్లు పోటీ ప‌డుతున్నారు.

వీరిలో శ్రీలీల‌, పూజాహెగ్డే, ర‌ష్మిక మంద‌న్న ముగ్గురు కాస్త ముందు వ‌రుస‌లో ఉన్నారు. అయితే ఈ రేసులో మిగిలిన ఇద్ద‌రు హీరోయిన్ల‌ను తీసి శ్రీలీల ముందు వ‌రుస‌లోకి దూసుకు వ‌చ్చేసింది. నిన్న మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త హీరోల‌ దగ్గర నుంచి సీనియర్ స్టార్ హీరోల‌ వరకు.. డైరెక్టర్స్‌, ప్రొడ్యూసర్స్ తో సహా అందరూ ముందుగా శ్రీ‌లీలానే అప్రోచ్ అవుతున్నారు.

ఇలా ప్రస్తుతం 12 సినిమాలకు సైన్ చేసింది శ్రీలీల‌. ఇంకా ఆమెకు ఒకటి రెండు ఛాన్సులు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక శ్రీ లీల తర్వాతి స్థానాన్ని మృణాల్‌ ఠాకూర్ సంపాదించుకుంది. సీతారామం మూవీతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మృణాల్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
శ్రీలీల తర్వాత అందరు మృణల్ ఠాకూర్‌కే ఓటేస్తున్నారు.

రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కూడా మృణాల్‌ ఠాకూర్‌నే హీరోయిన్గా అనుకుంటున్నారట. ఆ తరువాత ప్లేస్ నేషనల్ క్రష్ రష్మిక ఆక్యుపై చేసింది. శ్రీలీలా ,మృణాల్ తరువాత అవకాశాలు దక్కించుకుంటున్న స్టార్ హీరోయిన్ రష్మిక. ఇక నాలుగో స్థానాన్ని తమన్నా దక్కించుకుంది. మొదటి స్థానంలో ఉండవలసిన సమంత నెగటివ్ టాక్ కారణంగా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.