దిల్ రాజు పార్టీలో ఫోక‌స్ అంతా ఆమె మీదే.. ఎవ‌రామె.. ఎందుకంత స్పెష‌ల్‌..!

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌ల్లో ఉన్న అగ్ర నిర్మాత‌, టాప్ డిస్ట్రిబ్యూట‌ర్ల‌లో దిల్ రాజు ఒక‌రు. గ‌త 20 ఏళ్ల‌లో రాజు ప్ర‌స్థానం చూస్తే ఎక్క‌డికో వెళ్లిపోయింది. ఇక దిల్ రాజు ఇంట్లో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా ఇండ‌స్ట్రీ అంతా అటెండ్ అవుతూ ఉంటుంది. రాజు నుంచి పిలుపు వ‌స్తే మిస్ అయ్యే ఇండ‌స్ట్రీ జ‌నాలు ఎవ్వ‌రూ ఉండ‌రు. తాజాగా రాజు కుమారుడు పుట్టిన రోజు జ‌రిగింది. రాజు కొద్ది రోజుల క్రిత‌మే రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ జంట‌కు గత ఏడాది జూన్ 29న కొడుకు పుట్టాడు.

రాజు తన కొడుకు మొదటి పుట్టిన రోజు వేడుక ఎంతో వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ పుట్టినరోజు వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు అంద‌రూ హాజరయ్యారు.అయితే ఈ హాజరైన సెలబ్రిటీల్లో ఒకే ఒక్క అమ్మాయి మాత్రం స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచింది. పార్టీలో ఆమె అందానికి అక్క‌డికి వ‌చ్చిన వారంతా ఫిదా అయిపోయారు. దాదాపు అంద‌రి చూపు ఆమె వైపు నుంచి తిప్పుకోలేనంత ఎట్రాక్ష‌న్ అయిపోయింది ఆమె.

మ‌రి ఆమె ఎవ‌రో కాదు యంగ్ బ్యూటీ శ్రీలీల‌. ఆమె చేసింది త‌క్కువ సినిమాలే అయినా 100 సినిమాలు చేసిన హీరోయిన్‌కు వ‌చ్చేంత క్రేజ్ శ్రీలీల‌కు అప్పుడే వ‌చ్చేసింది. అస‌లు ఇప్పుడు ఆమె దెబ్బ‌కు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లుగా ఉన్న వాళ్లు సైతం వ‌ణుకుతున్నారు. ఏ హీరో సినిమాలో ఛాన్స్ చూసినా శ్రీలీలే ద‌క్కించుకుంటోంది.

స్టార్ హీరోల నుంచి, స్టార్ డైరెక్ట‌ర్లు, మిడిల్ రేంజ్ హీరోలు కూడా చివ‌ర‌కు త‌మ సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్‌గా ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. దీంతో శ్రీలీల కాల్షీట్లు అస్స‌లు ఖాళీ లేవు. దీంతో ఆమె ప్ర‌తి రోజు వ‌ర్క్ చేస్తేనే ఆమె ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్త‌య్యేలా ఉన్నాయి. ఇక శ్రీలీల సోష‌ల్ మీడియాలోనూ తన గ్లామర్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు మామూలు కిక్ ఇవ్వ‌ట్లేదు.

ఈ క్ర‌మంలోనే దిల్ రాజు ఇంట్లో జ‌రిగిన పార్టీలో ఆమె మెరూన్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో నడుస్తూ హోయ‌లు ఒలికిస్తూ కెమెరాకు పోజులిచ్చింది. ఆమె నడక, అందం నవ్వుకు కెమెరాలన్నీ ఆమెనే క్లిక్ మ‌నిపించాయి. ఆమె ఎటు వెళుతుంటే కెమేరాలు కూడా అటు వైపే తిరిగాయి. అలా రాజు పార్టీలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా శ్రీలీల నిలిచింది.