ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రీలీల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. ఈమె పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఈమె చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవుతుంది. అయితే ఈమె ఇప్పటివరకు చేసింది రెండు సినిమాల అయినా సోషల్ మీడియాలో మాత్రం 100 సినిమాలు చేసిన హీరోయిన్ రేంజ్‌ను అందుకుంది.
దానికి ముఖ్య కారణం శ్రీలీలా చిలిపితనం, అమాయకత్వం, యాక్టివ్ నెస్ అనే చెప్పాలి. అసలు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన పెళ్లిసందడి సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందంటే కేవలం శ్రీలీల క్రేజ్ కారణమని ట్రేడ్ వర్గాలు ముక్తకంఠంతో చెప్పేశాయి. ఎంతో కూల్ గా, చిన్న పిల్లగా, అల్లరిగా ఉండే శ్రీలీలకు సైతం కోపం వస్తుందట.
తన చుట్టూ ఎవరైనా తనకి ఇష్టం లేని పనిచేసిన,తన మాట వినకపోయిన శ్రీలీలకు ఊరుకునే కోపం వచ్చేస్తుందట. ఆమెకు కోపం వస్తే అందరిలాగా వస్తువులు పగలు కొట్టడం.. ఫైర్ అయిపోయి బూతులు తిట్టడం లాంటివి చేయదట. శ్రీలీలకు కోపం వస్తే వంటింట్లోకి వెళ్లి తన ముందు ఏది ఉంటే అది తన ప్లేట్ నిండా పెట్టుకుని కడుపునిండా తినేసి హాయిగా నిద్రపోతుందట.
అప్పుడు ఆమె కోపం చల్లారిపోతుందట. శ్రీ లీలకి రకరకాల వంటలంటే ఎంతో ఇష్టమని కూడా తెలిసింది ఈ నేపథ్యంలోనే శ్రీలీలకు బాగా కోపం వస్తే ఏం చేస్తుందనే విషయాన్ని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు ప్రతి అమ్మాయి కూడా శ్రీ లీల మాదిరిగానే ప్రవర్తిస్తే ఇంట్లో గొడవలు ఉండవు అంటూ ఆమెపై సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.