టాలీవుడ్ లో శ్రీలీల వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఆమె చేతులలో వరుసగా స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు గుంటూరు కారం – బాలయ్య భగవంత్ కేసరి, నితిన్, రామ్ ఇలా వరుసగా స్టార్ హీరోల పక్కన ఆమె నటిస్తోంది. తాజాగా ఆమె స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా ప్రమోషన్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిత్ర పరిశ్రమ అనేది గౌరవం ఉన్న ఇండస్ట్రీ.. మనం మన హద్దుల్లో ఉండి సినిమాలు చేసుకుంటే ఇక్కడ అడ్డేది ఉండదు.. ఎలాంటి ఇబ్బందులు రావు అని శ్రీలీల వ్యాఖ్యానించింది. తెలుగమ్మాయి అయినా హీరోయిన్ ప్రణవికి తాను ఇదే సలహా ఇస్తున్నానని కూడా శ్రీలీల చెప్పింది. ఈ సినిమాలో సంజయ్ రావు, మానుకొండ ప్రణవి జంటగా నటించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా ప్రమోషన్లలో శ్రీలీల చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే ఆమెను కూడా కొందరు ఇబ్బందులకు గురిచేశారని ప్రచారం జరిగింది. వాళ్లని ఉద్దేశించి శ్రీలీల ఇలా మాట్లాడిందా ? లేదా ఎవరికి వారు తమ కంట్రోల్లో తమ హద్దుల్లో ఉంటే మంచిదని ఇండైరెక్టుగా వార్నింగ్ ఇచ్చిందా ? అన్నదానపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి.