సినిమాల్లో తనకంటూ.. ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకున్న అన్నగారు ఎన్టీఆర్. సినిమా కథల నుంచి సాహిత్యం వరకు, సంగీతం నుంచిదర్శకత్వం వరకు.. అన్ని ఫ్రేమ్స్ లోనూ అన్నగారికి ప్రత్యేక శైలి ఉం ది. అయితే.. అన్నగారికి వీటన్నింటికీ మించిన డిసిప్లిన్ ఉంది. టైమంటే.. టైమే.. షూటింగు సమయానికి ప్రారంభించి.. నిర్ణీత సమయానికి పూర్తి చేయాలనిఅన్నగారు పట్టుబట్టేవారు. ఆయన అలానే వ్యవహరిం చేవారు.
దీనివల్ల.. నిర్మాతకు ఖర్చు తగ్గుతుందని చెప్పేవారు. అయితే.. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా పోయిందను కోండి. ఎంత ఖర్చు పెడితే.. అంత ఎక్కువ పాపులారిటీ ఉందని భావించే హీరోలు పెరుగు తున్నారు. అయితే.. దీనికి అన్నగారు చాలా అతీతంగా ఉండేవారు. నిర్మాత బాగుంటే.. మరో సినిమా చేస్తారు. ఆయన వల్ల ఇండస్ట్రీ బాగుంటుందని చెప్పేవారు. ఇక తన సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా కూడా అన్నగారు సినిమాలు చేశారు.
అప్పుడు కూడా ఎన్టీఆర్.. నా సోదరుడే కదా.. అని సొంత వ్యవహారాలు చేయలేదు. అక్కడ కూడా క్రమ శిక్షణ పాటించారు. దీంతో అన్నగారి సరసన నటించిన క్యారెక్టర్ ఆర్టిస్టులు.. రాజనాల, కాంతారావు, గుమ్మడి, రమణారెడ్డి వంటివారు.. హడలిపోయేవారు. అన్నగారి సినిమాలో నటిస్తున్నామనే ఆనందం ఉన్నా.. ఆయన క్రమశిక్షణ ముందు.. తాము ఎక్కడ విఫలమవుతామో.. ఆయన ఫీలింగ్స్‌ను తట్టుకోలేమని వారు చెప్పేవారు. ఇలా.. అనేక మంది తమ పద్ధతులు మార్చుకున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది.