ఒక్క ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..? ఆడవారి కి ఇంత మేలు చేస్తుందా..? ప్రతి మహిళ తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు..!!

ఉల్లి చేసిన మేలు తల్లైనా చేయదు అని పెద్దవారు చెప్పే సామెత చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే చాలామందికి ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలియ‌వు. పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయలో మన ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు కోకొల్లలుగా ఉన్నాయి. డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు, హార్మోన్ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి అనేక సమస్యలను నివారించడంతోపాటు ఉల్లిపాయ నెలసరి సమస్యలను కూడా అదుపులో ఉంచుతుంది.

How to Cut an Onion (with minimal tears) | Chef Janet

వీటితో పాటు ఉల్లిపాయ శరీరంలోని వేడికణాలను తగ్గించి శరీరానికి చలవ చేసేలా చేస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న మహిళల్లో 50% పైగా మహిళలు నెలసరి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొందరికి వికారంగా అనిపించడం, మరికొందరికి కడుపులో నొప్పి విపరీతంగా రావడం, పొట్టలో తిప్పినట్లు తిమ్మిరి పట్టినట్లు అనిపించడం, అలాగే నెలసరి క్రమ పద్ధతిలో రాకపోవడం వంటి ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

7 amazing health benefits of eating onion in summers

ఇలాంటి నెలసరి సమస్యలను ప్రతిరోజు ఒక పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల దూరం పెట్టవచ్చు. ఉల్లిపాయను దాదాపు కూరలోనే ఉపయోగిస్తారు తప్ప పచ్చి ఉల్లిపాయ ని తినడానికి ఎవరు ఇష్టపడరు. కానీ పచ్చి ఉల్లి తినడం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. నెలసరి సమస్యలకే కాకుండా పచ్చి ఉల్లిపాయ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి, గుండే సంబంధిత సమస్యలు, రక్తం గడ్డ కట్టడం, హార్ట్ స్ట్రెస్, వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది. దీంతోపాటు గుండె ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది.

One Major Side Effect of Eating Onions, Say Dietitians — Eat This Not That

అలాగే జలుబు, దగ్గు, జ్వరం వంటి రోగాల నుంచి ఉపశమనం పొందడానికి.. కావ‌ల్సిన‌ రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉల్లిపాయ ప‌నిచేస్తుంది. అలాగే ఉల్లిపాయలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించే శక్తి ఉంటుంది. దీనివల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాలను కూడా నివారించవచ్చు. క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడానికి కూడా ఉల్లిపాయ ఎంతగానో సహకరిస్తుంది. ఇలా అనేకరకాల సమస్యలను నివారించడానికి ఉల్లిపాయ ఔషధంలా పనిచేస్తుంది.