నోటి దుర్వాసన.. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ లో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. రోజువారి జీవితంలో బిజీ షెడ్యూల్ తో నోటి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకుండా చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. దీనివల్ల దంతాల అందాన్ని పాడు చేసుకోవడమే కాకుండా నోటి దుర్వాసన, చిగుళ్ళు పళ్ళనొప్పి, పయోరియా, క్యావిటీస్ లాంటి చాలా రకాల నోటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అలాగే చిన్న వయసులోనే దంతాలు ఊడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి.
అలాంటి పరిస్థితులు రాకముందే మనం నోటి ఆరోగ్యం పై శ్రద్ధ వహిస్తే మంచిది. నోరు, పళ్ళ ఆరోగ్యం కోసం రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవాలి. దీంతోపాటే కొన్ని ఆయుర్వేదిక్ చిట్కాలను కూడా పాటించడం వల్ల నోటిలో దుర్వాసన, చిరగురు వాపు లాంటి నోటి సంబంధిత అనేక సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
నోటి శుభ్రతకు ఆయుర్వేదిక్ చిట్కాలు :
వేప పుల్ల :
యాంటీ బ్యాక్టీరియల్, యాంటి ఇంప్లిమెంటరీ లాంటివి పుష్కలంగా ఉన్న వేప పుల్లతో నోటిని రోజు శుభ్రం చేసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దుర్వాసన నుంచి విముక్తి కలగడమే కాక చిగుళ్ల సమస్యలు కూడా నివారించవచ్చు. ప్రతిరోజు వేప పుల్లతో బ్రష్ చేసుకోవడం కుదరకపోయినా కనీసం 15 రోజులకు ఒకసారి అయినా దాన్ని ఉపయోగించడంతో మంచి ఫలితం ఉంటుంది.
వేప ఆకు :
వేప పుల్లలాగే పుష్కలమైన గుణాలను కలిగి వేపాకులు కూడా ఉంటాయి. వేపాకుల పేస్టును ఉపయోగించి పళ్ళను శుభ్రం చేసుకోవడం వల్ల.. చిగుళ్ళకు మసాజ్ చేయడం వల్ల.. చిగురు నొప్పి, వాపు వంటి సమస్యలు ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. చిగుళ్లలో రక్తస్రావం సమస్య ఉంటే ఇది కూడా నివారించబడుతుంది.
లికోరైస్ (అతిమధురం) :
లికోరైస్ తెలుగులో అతి మధురం అంటారు. దీనిని ఆయుర్వేదిక్ లో చాలా ఔషధాలు తయారీకి ఉపయోగిస్తారు. ఈ అతిమధురం ఉపయోగించడం వల్ల దంతాలు పసుపు రంగు తొలగిపోవడంతో పాటు చిగురుల సమస్య కూడా నివారించబడుతుంది. లికోరైస్ ను పొడిచేసి దంతాలకు టీత్ పౌడర్ గా యూస్ చేయవచ్చు.