శృతీహాస‌న్‌కు ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ ఆమె కెరీర్‌కు మైన‌స్ అయ్యిందా..!

లోకనాయుడు కమల్ హాసన్ పెద్దకూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలమైనా ఇప్పటికీ అదే క్రేజ్ తో కొనసాగుతుంది ఈ ముద్దుగుమ్మ. తండ్రి పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. సొంత టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. యాక్టర్ గానే కాక సింగర్, మంచి డాన్సర్ గాను మల్టీ టాలెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ మొదట్లో కాస్త తడబడిన ఆ తర్వాత వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెరుస్తోంది.

కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో లండన్‌కు చెందిన‌ మైకేల్ కోర్సులతో లవ్‌లో పడి లవ్ బ్రేకప్‌తో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన శృతి ప్రస్తుతం తెలుగులో మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుంటూ టాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుంది శృతి. వాటిలో ఒకటి ప్రభాస్ ‘ సలార్ ‘ సినిమా కాగా.. మరొకటి నేచురల్ స్టార్ నాని ‘ హాయ్ నాన్న ‘ ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. సలార్ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 28న‌ విడుదల చేస్తున్నారు. ఇక హాయ్ నాన్న మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంత క్రేజ్‌ను సంపాదించుకున్న శృతిహాసన్‌కు భయంకరమైన ఓ సమస్య ఉందట. చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా ఆవేశపడడం.. చాలా వేగంగా సహనాన్ని కోల్పోవడం శృతిహాసన్ ను చాలా ఇబ్బంది పెడుతుందట.

ఈ సమస్య వల్ల శృతిహాసన్ మొదట్లో ఎంతోమంది తనకి ఇష్టమైన వారిని దూరం చేసుకున్నారని స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇది త‌న కెరీర్‌కు కూడా కొంత ఇబ్బందిగా మారింద‌ని కూడా శృతి తెలిపింది. ఇక ఈ సమస్యను దాచుకోవడం వల్ల మరింత పెరిగే అవకాశం ఉందని అందుకే చెబుతున్నానంటూ వివ‌రించింది. శృతిహాసన్ ప్రస్తుతం సంతానూ హాజారికాతో లవ్ ట్రాక్ నడుపుతున్న ఈ ముద్దుగుమ్మ రిలీఫ్ కోసం మ్యూజిక్ వినడానికి ఇష్టపడుతుందట.