తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ కెరీర్ పరంగా పెద్ద సంచలనాలు లేకపోయినా మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో అయితే నిలుస్తోంది. నిజంగా హీరోయిన్ ఆమె కొట్టిన సూపర్ హిట్లూ లేవు. ఆమె పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన ఏమీ నటించలేదు. అయితే సమంతతో విడాకుల తర్వాత అక్కినేని హీరో నాగచైతన్యతో ఆమె ప్రేమాయణం నడుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చైతు, సమంత ఇండియాలో మాత్రమే కాదు.. విదేశాల్లోనూ కలిసే చక్కెర్లు కొడుతున్నారు. ఇక శోభిత చైతుతో కలిసి కనిపించడంతో పాటు తన గ్లామర్ షో విషయంలోనూ, వెబ్‌సీరిస్‌ల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ బాగా వార్తల్లో ఉంటుంది. శోభిత సినిమా అయినా… ఫోటోషూట్ లు… పబ్లిక్ లో కనిపించినా ప్రతిసారీ హాట్ కంటెంట్ తో కుర్రోళ్లను రెచ్చగొట్టేలానే ఉంటుంది.
శోభిత తాజాగా `ది నైట్ మేనేజర్ సీజన్ 2` స్క్రీనింగ్ కు హాజరైంది. అప్పుడు కూడా ఆమె అంతే హాట్‌గా కనిపించింది. ఈ క్రేజీ వెబ్ సీరిస్‌లో ఆమె ఘాటైన శృం…రంలో వేడెక్కించిందంటున్నారు. అసలు ఈ వెబ్‌సీరిస్ ప్రచార కార్యక్రమంలోనే ఆమె అందమైన వింక్‌తో గుబులు రేపింది. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన `ది నైట్ మేనేజర్ 2` గత కొంతకాలంగా మోస్ట్ అవైటెడ్ సిరీస్ గా చర్చల్లో నిలిచింది.
ఇందులో ఆమె చాలా ఘాటు సన్నివేశాల్లో కనిపించింది. ఈ సీరిస్‌లో ఆమె భర్త ఉండగానే పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుని మోసం చేసే భార్యగా నటించింది. ఇటీవల ఈ వెబ్ సీరిస్ షో స్క్రీనింగ్‌కు హాజరైన ఆమెను చాలా హాట్‌గా ఉన్నావంటే కిర్రాక్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇక IMDb ప్రముఖ భారతీయ సెలబ్రిటీల జాబితాలో శోభిత పేరు నంబర్ వన్‌గా నిలిచిందంటే ఆమెకు పబ్లిక్‌లో ఎలాంటి రెస్పాన్స్ ఉందో తెలుస్తోంది.