బికినీతో న‌వ్వులు చిందిస్తోన్న ఈ న‌టి క‌న్నీటి గాథ తెలుసా..!

శిఖా మల్హోత్ర.. షారుక్ ఖాన్ ‘ ఫ్యాన్స్ ‘ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ సినిమాలో కీరోల్ ప్లే చేసిన శిఖా.. రన్నింగ్ షాది, అన్ సీన్ ఈవల్ 2 ఇలా కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది. 2020 కోవిడ్ టైంలో నర్స్ గా మారి ఎంతోమందికి సేవలందించిన శిఖా ఫస్ట్ మూవీ కాంచ్లి రిలీజైన‌ నెల రోజుల్లోనే నర్సుగా అవతారం ఎత్తడంతో ఎంతోమంది ప్రశంసలు కురిపించారు. కానీ విధి విచిత్రమైనదన్నట్లు మంచివారికి కష్టాలు వస్తాయి అన్నచందంగా అదే ఏడాది చివరలో ఆమెకి కరోనా పాజిటివ్ వచ్చింది.

కోవిడ్ నుంచి బయటపడే టైంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి తన శరీరంలోని కుడిభాగం అంతా పక్షవాతానికి గురైంది. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వచ్చింది. దాని కారణంగ ఆమె కాస్త లావైంది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే ఆలోచనను ఆమె వదులుకుంది. కానీ ఇంకా ఎన్నాళ్ళు ? ఈ బాధతో కుంగిపోవాలి.. నా మీద నేనే పోరాటం చేసి గెలవాలి అని పట్టుదలతో మళ్ళీ ముందులా మారిపోవడానికి ప్రయత్నాలు చేసింది.

తన దృఢ సంకల్పం ముందు పక్షవాతం కూడా పారిపోయింది. నెమ్మదిగా అనారోగ్యం నుంచి కోలుకున్న శిఖా ఎలా ? మళ్లీ నార్మల్ స్టేజ్ కి చేరుకొంద‌నే విషయాన్ని అందరికీ తెలియాలనుకుంది. అందుకే ఆ భ‌యం మ‌ర్చిపోయేలా త‌న ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఆమె బికినీ ఫొటోల‌తో జర్నీ పోస్ట్ చేసింది.

నిజంగానే ఎంతోమందికి ఇన్స్పిరేషనల్ గా ఆమె స్టోరీ ఉంది. ఇక 2018లో సీకా మొదటి సినిమా కాంచ్లి కోసం 14 కిలోలు వెయిట్ పెరిగింది. ఈ సినిమా 2020 ఫిబ్రవరి 7న రిలీజై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది గూగుల్ టాప్ 50 సినిమాల్లో కాంచ్లి ఒకటి.