బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‌ఖాన్‌కు ఆక్సిడెంట్..

బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ పలు సీరియల్స్ లో హీరోగా తన కెరియర్ స్టార్ట్ చేసి అంచలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దిల్‌వాలే దుల్హేనిజాయేంగే సినిమాతో బాలీవుడ్ ఒక్క‌సారిగా తిరుగులేని పాపుల‌ర్ హీరో అయిపోయాడు. 1990వ ద‌శ‌కంలో వ‌రుస హిట్లు కొట్టడంతో మంచి గుర్తింపు తుచ్చుకున్నాడు. 80కి పైగా సినిమాల్లో న‌టించాడు.

అప్ప‌ట్లో షారుక్ అమ్మాయిల క‌లల రాకుమారుడు. ఇక ఈ యేడాది ప‌ఠాన్ సినిమాతో ఆరేడేళ్ల త‌ర్వాల అదిరిపోయే హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు షారుక్‌. ఇక కొన్ని సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించిన షారుక్ ప్రస్తుతం జవాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. నయనతార హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ ద‌ర్శ‌కుడు.

ఇక ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో జ‌వాన్ షూటింగ్ జ‌రుగుతుండ‌గా షారుక్‌కు తీవ్ర గాయాలు అయిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వైద్యులు ఆయ‌న‌కు శ‌స్త్ర‌చికిత్స చేస్తున్నార‌ని.. ప్రాణాపాయం లేద‌ని అంటున్నారు. షారుక్ ముక్కుకు గాయం అయ్యింద‌ని షారుక్ ప్ర‌స్తుతం ఇండియాకు తిరిగి వ‌చ్చార‌ని అంటున్నారు. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సానియా మల్హోత్రా, ప్రియమణి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. అలాగే రాజ్ కుమార్ హీరాణీ దర్శకత్వంలో డుంకీ తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటిస్తున్నారు.