టాలీవుడ్ సీనియర్ హీరోలో ప్రస్తుతం సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవక ముందే చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న బాబితో ఓ సినిమా ఫిక్స్ అయ్యాడు. రీసెంట్ గానే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.
ఆ పోస్టర్లో అతనికి ప్రపంచం మొత్తం తెలుసు కానీ అతని గురించి ప్రపంచానికి తెలియదు అంటూ.. ఒక పెట్టిలో రకరకాలా మారణాయుధాలు, సిగరెట్ పెట్టె, మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ ఉంచి ఈ సినిమా ఫ్రీ పోస్టర్‌తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాడు బాబి. ఒక టైంలో రెగ్యులర్ మాస్ సినిమాలు చేసే బాలకృష్ణ ఇప్పుడు మాత్రం యంగ్ దర్శకులతో కలిసి కొత్త కొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తున్న భగవంత్ కేసరిలో కూడా బాలయ్యను ఇప్పటివరకు చూడని కొత్త లుక్‌లో చూస్తామని అర్థమవుతోంది. ఈ సినిమా తర్వాత వచ్చే బాబీ సినిమా కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ విన్న బాలయ్య ఎంతో ఎక్సైట్ అయినట్టు టాక్ ? ఈ సినిమా స్టోరీ విని సింగిల్ సిట్టింగ్ లోనే ఈ మూవీ ఫిక్స్ చేసుకున్నారట. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు.
అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న బాలయ్య 109వ సినిమాను మూడు లేదా నాలుగు నెలల్లో పూర్తి చేయాలనే టార్గెట్ ను కూడా పెట్టుకున్నారు. అన్నీ కుదిరితే వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సంక్రాంతికి బాలయ్య సినిమా అంటే మామూలుగా ఉండదు ఇక బాక్స్ ఆఫీస్ కి దబిడి దిబిడే. ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి అంటూ వచ్చి బాక్సాఫీస్ దగ్గర ఊచ కోత కోశాడు బాలయ్య. ఇప్పుడు తన 109వ సినిమాను కూడా సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా రెడీ అవుతున్నాడు.