అంజ‌లీదేవి వ‌ర్సెస్ రామారావు.. ఈ వివాదంతో అన్ని సినిమాలు క‌ట్‌..!!

మ‌హాన‌టి పేరు ఇవ్వ‌క‌పోయినా… ఆ రేంజ్‌కు మించిన స్థాయిలో పేరు తెచ్చుకున్న న‌టీమ‌ణి అంజ‌లీదే వి. ఆమె అనేక సినిమాల్లో న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు. సొంత బ్యాన‌ర్‌ను స్థాపిం చి.. అనేక భాష‌ల్లో సినిమాలు కూడా చేశారు. హిందీలోనూ.. నిర్మాత‌గా సినిమాలు చేసిన తొలి తెలుగు హీరోయిన్ అంజ‌లీదేవే కావ‌డం గ‌మ‌నార్హం. ఆమె ఎక్కువ‌గా ఎన్టీఆర్‌తోనే న‌టించారు. ఆయ‌న‌తో క‌లిసి న‌టించేందుకే ఇష్ట‌ప‌డేవారు.

ఇష్టం లేకపోయినా.. ఆ హీరోయిన్ కోసం.. ఎన్టీఆర్ ఆ సినిమాలో నటించారట తెలుసా | why sr ntr accepted bandi panthulu movie details, sr ntr, nandamuri taraka rama rao, heroine anjali devi, badi panthulu ...

ఇలా.. అనేక సినిమాల్లో ఎన్టీఆర్‌-అంజ‌లీదేవి క‌లిసి న‌టించారు. అంజ‌లీదేవి సొంత బ్యాన‌ర్‌పైనా అన్న‌గా రు న‌టించారు. అయితే.. బ‌డిపంతులు సినిమా త‌ర్వాత‌. ఇద్ద‌రూ క‌లిసిన టించ‌డం మానేశారు. దీనికి కార‌ణం వివాదం ఏర్ప‌డ‌డ‌మేన‌ని అంటారు. ఆ వివాదం ఏంట‌నేది ఇత‌మిత్థంగా తెలియ‌క పోయినా.. అన్న‌గారు మాత్రం అంజ‌లీదేవిని ప‌క్క‌న పెట్టారు. అప్ప‌టి వ‌ర‌కు ల‌వ‌కుశ వంటి సూప‌ర్ హిట్ మూవీలోనూ న‌టించిన సంగ‌తి తెలిసిందే.

NTR And Anjali Devi Old Song | Shobha Movie Video Song | Super Hit Telugu Movie - YouTube

ఇక‌, ఆ త‌ర్వాత అంజ‌లీదేవి క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారు. ఇక‌, ఎన్టీఆర్ న‌టించ‌న‌ని చెప్పాక కూడా అనేక సినిమాలు చ‌చేసిన అంజ‌లీదేవి అన్ని సినిమాల్లోనూ అక్కినేని నాగేశ్వ‌ర‌రావును హీరోగా తీసుకున్నారు. భ‌క్త తుకారం నుంచి అనేక సినిమాల‌ను అక్కినేనితోనే ఆమె న‌టించారు. ఇక‌, ఎన్టీఆర్ కూడా.. అంజ‌లీదేవి స్థానంలో ప్ర‌భ‌, వాణీ విశ్వ‌నాథ్ వంటి వారికి అవ‌కాశం ఇచ్చారు. ఇలా.. అంజ‌లీదేవి వ‌ర్సెస్ రామారావుల మ‌ధ్య ఏర్పడిన వివాదం చివ‌రి వ‌ర‌కు అలానే ఉండ‌డం గ‌మ‌నార్హం.