టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో లేటెస్ట్ గా తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఖలేజా, అతడు సినిమాల తర్వాత 13 ఏళ్ల లాంగ్ గ్యాప్ తీసుకుని ఈ కాంబోలో వస్తోన్న ఈ సినిమా పై అందరిలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. పూజాహెగ్డే – శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసాయి.
మహేష్ బాబు మంచి ఊరమాస్ రోల్లో కనిపించనున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ఫ్యామిలీ అంశాలు, సెంటిమెంట్ కూడా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎన్నోసార్లు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మరోసారి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
తాజా షెడ్యూల్ తర్వాత గుంటూరు కారంకు కొద్ది రోజుల పాటు బ్రేక్ తప్పదంటున్నారు. మహేష్‌బాబు కొద్ది రోజుల పాటు విదేశాలకు వెళ్లి రానున్నారట. ఈ లోగా ఇతర నటీనటులపై షూటింగ్ ఉంటుందని చెపుతున్నా ఏదో అనుమానాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ను ఈ సినిమా నుంచి తప్పించారని పుకార్లు వచ్చాయి. మెయిన్ హీరోయిన్ పూజాహెగ్డే విషయంలోనూ అదే రూమర్లు వినిపించాయి.
ఇప్పుడు మహేష్ మరోసారి విదేశాలకు వెళుతుండడంతో అసలు గుంటూరు కారం షూటింగ్ విషయంలో ఏం జరుగుతుందో ? అర్థం కావడం లేదు. ఏదేమైనా రెండు మూడు సార్లు మహేష్ ఇంట్లో జరిగిన సంఘటనలతో ఈ సినిమా షూట్ లేట్ అయితే ఇప్పుడు త్రివిక్రమ్ ఈ సినిమాను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో షూటింగ్ ఏ మాత్రం ముందుకు కదలడం లేదు.
త్రివిక్రమ్ అయితే పవన్ సినిమాలపై ఫోకస్ పెడుతూ గుంటూరు కారం సినిమాను సంకనాకించేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. అందుకే మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్ మీద చాలా గుర్రుగా ఉన్నారు.