నిర్మాత రామానాయుడుకు మంచి పేరుంది. దర్శకుల మాదిరిగానే ఆయన కూడా చొరవ తీసుకునేవారు. ఎంతో మంది హీరోయిన్లకు ఆయన లైఫ్ ఇచ్చారు. తొలినాళ్లలో రామానాయుడు నిర్మాత గా ఉన్న సినిమా ల్లో నటించడం ఒక ప్రివిలేజ్. దీంతో ఆయన దగ్గర నటించేందుకు నటీమణులు క్యూ కట్టేవారు. ఇలానే.. శ్రీదేవితో చేసిన హిట్ సినిమా దేవత. నిర్మాత డి. రామానాయుడు. దర్శకుడు రాఘవేంద్ర రావు.
శోభన్ బాబు ఇందులో హీరో. జయప్రద, శ్రీదేవి కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ. ఇది 1982లో విడుదల అయి ఒక సంచలనం సృష్టించింది. ఇది తరువాత హిందీలో కూడా తీశారు. జితేంద్ర హిందీలో హీరో అయితే.. శ్రేదేవి, జయప్రదలే అక్కడా కలిసి నటించారు. అక్కడకూడా ఈ సినిమా 100 రోజులు ఆడింది.
అయితే ఇందులో బిందెల పాట చాలా ఫేమస్. ‘ఎల్లువొచ్చి గోదారమ్మ….స పాట షూటింగ్ గోదావరి తీరంలో తీశారు. యూనిట్ సభ్యులు అందరూ చేరుకున్నారు, అంతా రెడీ చేసేసారు. దర్శకుడు, శోభన్ బాబు మిగతా యూనిట్ సభ్యులు అందరూ కూడా పాట కోసం నీటి మధ్యలోకి చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లాలంటే ఒక దగ్గర నీళ్లు పాదాలు తాకుతాయి.
అప్పుడు శ్రీదేవి ఎలా నడవాలి ఆ నీళ్లలోంచి చీర తడిసిపోతుంది అని అలోచించి నిర్మాత రామానాయుడుని అడిగిందిట. అప్పుడు నాయుడు శ్రీదేవిని చిన్నపిల్లని ఎత్తుకున్నట్టు ఎత్తుకొని గబా గబా నడిచి ఇవతల నుండి అవతలకి తీసుకెళ్లారట. ఈ విషయం అప్పట్లో సంచలనం. దీంతో పత్రికలు అన్నీ కూడా.. శ్రీదేవిని ఎత్తుకెళ్లిపోయిన రామానాయుడు టైటిల్‌తో కథనాలు రాశాయి. ఏదేమైనా.. సినిమా మాత్రం సూపర్ హిట్ కొట్టడంతో అంతా సంతోషించారు.