గుంటూరు జిల్లాలో అధికార పార్టీ వైసీపీలో ఆధిపత్య పోరు తెరమీదికి వచ్చింది. కొన్నాళ్లుగా చాప కింద నీరులాగా ఉన్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు తాడేపల్లి ప్యాలస్ వరకు చేరిందని వినికిడి. నిజానికి ప్రతి నియోజకవర్గంలోనూ ఎమ్మెల్యే రారాజుగా ఉన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. కానీ, ఎందుకో.. గత రెండేళ్లుగా మాత్రం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధిపత్య పెరిగిపోయింది. ఇది జిల్లా వరకు వచ్చింది.
దీంతో వివాదాలు.. విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. పొన్నూరులో ప్రారంభమైన ఆధిపత్య రాజకీ యం.. ప్రత్తిపాడు వరకు పాకిందని అంటున్నారు. మంత్రులు సైతం ఎమ్మెల్యేల వివాదాల్లో జోక్యం చేసు కునేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేయడం తగదని కూడా వారిస్తు న్నారు. అయితే, అసలు ఏం జరిగిందంటే.. ప్రతి నియోజకవర్గంలోనూ గడపగడపకు కార్యక్రమం నిర్వహించాలని జగన్ నిర్దేశించారు.
దీనిలో కొందరు పాల్గొంటున్నారు. మరికొందరు డుమ్మా కొడుతున్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసేందు కు జిల్లా ఇంచార్జ్‌లను… గృహ సారథులను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. వారు పర్యవేక్షిస్తున్నా రు. అయితే.. తమపై పొరుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నారని.. అందుకే ప్రభుత్వం తమపై నిఘా పెట్టిందని.. ప్రత్తిపాడు ఎమ్మెల్యే మాజీ మంత్రి మేకతోటి సుచరిత కొన్ని రోజుల కిందట వ్యాఖ్యానించారు. దీనిని ఎవరూ పెద్దగా విశ్వసించలేదు.
అయితే.. పొన్నూలు ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా ఇదే వాదనను తెరమీదికి తెచ్చారు. నాపై ఉన్న ఉక్రోషంతోనే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక, బాపట్ల నియోజకవర్గంలోనూ మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కూడా పార్టీలో కొందరు తనను శత్రువుగా చూస్తున్నారని.. వారు మా జిల్లా వారేనని.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు కోరుకుంటున్నవారు..ఇక్కడేదో జరుగుతోందని మీడియాకు లీకులు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు.
అటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సైతం అధిష్టానంపై తీవ్రమైన అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ఇప్పటికే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీలో అవమానాలు ఎదురయ్యాయంటూ తీవ్ర విమర్శలు చేయడం.. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈ వరుస పరిణామాలతో గుంటూరు జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం దీనిపై సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టి పెట్టారని సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.