టాలీవుడ్ స్టార్ కపుల్ వరుణ్ సందేశ్ – వితికా ఈ పెయిర్ కి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు వరుణ్ సందేశ్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నటించాడు. పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా లో వితికా తో నటించిన వరుణ్ .. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో అయిన బిగ్బాస్ లో భార్యతో కలిసి పాల్గొన్నాడు వరుణ్. సినిమా చాన్సులు లేకపోవడంతో వరుణ్ ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో నటించకపోయినప్పటికీ అప్పుడప్పుడు కొన్ని షోస్ లో భార్య వితికతో కలిసి పాల్గొంటున్నాడు.
ఇటీవల వితిక తో కలిసి ఒక షోలో పాల్గొన్న వరుణ్ తన భార్య వితిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. “వితికాను నేను పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమా షూటింగ్ టైంలోనే కలిశానని ..కానీ వితికా మాత్రం నన్ను కొత్త బంగారులోకం సినిమా టైం లోనే చూసిందని” చెప్పుకొచ్చాడు. వీరిద్దరూ కలిసి నటించిన పడ్డానండి ప్రేమలో మరి సినిమా షూటింగ్ టైం లో ఒక సీన్ లో వితికను కింద పడేయగా వితికకు తీవ్రమైన నడుము నొప్పి వచ్చిందని ఆమె ఆ సమయంలో బాగా ఇబ్బంది పడింది.. మొదట్లో వితికా కి పొగరు అనుకున్నాను కానీ తర్వాత ఆమె ఫ్రెండ్లీ నేచర్ అర్థమైందని చెప్పుకొచ్చాడు.
ఆ సినిమా షూటింగ్ టైంలో మలేషియా కు వెళ్ళగా వారిద్దరి మధ్యన ప్రేమ చిగురించిందని .. నా గతం గురించి కూడా వెతిక కు చెప్పగా ఆమె గతాన్ని అంగీకరించడంతో ఇద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నామని.. తరువాత వితికా మా పేరెంట్స్ తో ఫోన్ లో మాట్లాడేదని.. ఆ తర్వాత న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా వేగస్ కు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళగా అక్కడికి వితికా వచ్చి సడన్ గా సర్ప్రైజ్ చేసిందని వితిక సర్ప్రైజ్లు ఎక్కువగా ప్లాన్ చేస్తుందని చెప్పుకొచ్చాడు వరుణ్.
అదే టైంలో వరుణ్ సందేశం మాట్లాడుతూ వితికపై ఎటువంటి సందర్భంలో కోపం వస్తుంది అని అడగగా ఈ మధ్యన ఎటువంటి చర్చ జరిగిన మొదటిగా ఫోన్ కాల్ నాన్నకు వెళుతుందని.. ఆ కంప్లైంట్ తప్ప మరే కంప్లైంట్ లేదంటూ చెప్పుకోవచ్చాడు వరుణ్. దీంతో పాటే నా టూత్ బ్రష్ ను వితికా వాడేస్తుందని ..ఆ టైంలో కోపం వస్తుందని.. నాకు సంబంధించిన ఒక వీడియోను వితికా గతంలో మిడియాలో షేర్ చేసిందని.. ఆ వీడియో టూ మచ్ గా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. కోపంతో ఆ సందర్భంలో మైక్రోవేవ్ ని కూడా పగులు కొట్టాను అని చెప్పాడు వరుణ్.