లావణ్య అది ఎంత కావాలంటున్నా “నో” అంటున్న వరుణ్ తేజ్.. ఈ మెగా హీరో పని కొంచెం తేడాగానే ఉందే..!!

తెలుగు చిత్రపరిశ్ర‌మ‌లో ఇప్పటికే యంగ్ హీరోలు అందరు వరుసగా పెళ్లిళ్లు చేసుకుంటూ ఒకటవుతున్నారు. ఈ క్రమంలోని మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఈ ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ వ్యామ‌హరం అందర్నీ ఒకసారిగా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అసలు వీరిద్దరూ ప్రేమించుకున్నారని విషయం ఎవరికీ అసలు పెద్దగా తెలియదు. ఇద్దరు కలిసి జంటగా మిస్టర్ అనే సినిమాలో నటించారు.

ఇక ఆ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారిందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరూ అంతరిక్షం సినిమాలో కలిసి నటించిన మిగిలిన ప్రేమ జంటల్లా ఎక్కడ కలిసి కనిపించలేదు. ఎవరితోనూ తమ ప్రేమ గురించి బయటకు కూడా చెప్పలేదు. సాధారణంగా సెలబ్రిటీల‌ ప్రేమ విషయాలు ఏదో ఒక రూపంలో బయటకు లీక్ అవుతూ ఉంటాయి కానీ వీళ్ళ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగలేదు.

కేవలం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట ఎక్కడ బయటకు కూడా కనిపించడం లేదు. ఎంగేజ్మెంట్ అంటే ఇప్పటికే సగం పెళ్లి అయిపోయినట్టే. ముందు నుంచి ఈ జంట తమ ప్రేమ విషయం ఎంతో సీక్రెట్ గా ఉంచారు. ఇప్పుడు కూడా అలానే ఉంటున్నారు. ఎవరి పని వారు చూసుకుంటూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదే క్రమంలో పలు టీవీ చానల్స్ వారి టిఆర్పి రేటింగ్ కోసం ఈ జంటను పెళ్ళికి ముందు ఇంటర్వ్యూ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారట.

ఇప్పటికే మెగా ఫ్యామిలీని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారట. లావణ్య త్రిపాఠికి కూడా ఇంటర్వ్యూలో పాల్గొనడానికి సిద్ధంగా ఉందని అయితే వరుణ్ తేజ్ మాత్రం పెళ్లి తర్వాతే ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ గట్టిగా చెబుతున్నారట. ఇప్పటికే వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు తన కూతురు జీవితంలలా కొడుకు జీవితం అవ్వకూడదని మెగా కుటుంబంలో ఉన్న వారికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారట. ఎలాంటి మీడియా ఇంటర్వ్యూలకు వెళ్లొద్దని అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదంటూ గట్టిగా క్లాస్ తీసుకున్నారట. ఈ క్రమంలోనే లావణ్య ఇంట్రెస్ట్ చూపిస్తున్న సరే వరుణ్ తేజ్ మాత్రం నో అంటూ వాటికి దూరంగా వెళ్తున్నారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరి పెళ్లికి సంబంధించిన అధికార ప్రకటన కూడా త‌ర్వార‌లోనే ప్రకటించనుంది మెగా ఫ్యామిలీ.